సైమా అవార్డ్స్: సోకుల షో

SIIMA Awards turn stage for showcasing glam assets for heroines
Monday, July 3, 2017 - 15:45

సైమా సందడి మొదలైతే చాలు, ఎవరికి అవార్డులు వచ్చాయనేది అప్రస్తుతంగా మారిపోతుంది. ఎవరు ఎలా ముస్తాబయ్యారు, ఎవరు ఏ స్థాయిలో అందాలు ఆరబోశారు అనేదే మెయిన్ టాపిక్ అయిపోతుంది. ఎప్పట్లానే ఈసారి కూడా సైమా అదిరిపోయింది. నయనతార, రకుల్, రెజీనా, నివేథా థామస్, శ్రియ, త్రిష.. ఇలా ఒకరేంటి దాదాపు హీరోయిన్లంతా ఓ రేంజ్ లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు.

ఎప్పట్లానే నయనతార ఈసారి కూడా సీరియస్ గానే ముస్తాబైంది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో వచ్చిన నయన్, ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో పాత్రల్లాగే సీరియస్ గా కనిపించింది. ఇక శ్రియ సంగతి సరేసరి. ఈవెంట్ ఏదైనా తనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవ్వాలనుకుంటుంది. అందుకే ప్రేక్షకులకు కనువిందు కలిగించడానికి మ్యాగ్జిమమ్ ట్రై చేసింది.

త్రిష కూడా వయసు పెరిగినా తనలో సొగసు తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. ఈమెతో పాటు రెడ్ కార్పెట్ పై మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ తొలిరోజు ఈవెంట్ లో బ్లాక్ కలర్ డ్రెస్ తో మెరుపులు మెరిపించింది. బాలీవుడ్ నుంచి కత్రినాకైఫ్, రణబీర్ కపూర్ జోడీ కూడా సైమాకు వచ్చి సందడి చేసింది. 

ఇలా ఈవెంట్ కు వచ్చిన ప్రతి హీరోయిన్ తమదైన ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. మ్యాగ్జిమమ్ కెమెరాల్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. ఈసారి వేడుకలో ఎవరికి ఏ అవార్డు వచ్చిందనే అంశం కంటే.. ఏ హీరోయిన్ ఏ డ్రెస్ వీసుకుందనే చర్చే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించింది.