శింబు కొత్త లవర్ ఈమేనట!

This is Simbu's new lover?
Monday, February 17, 2020 - 09:15

శింబు ఎఫైర్ల గురించి ఇక్కడ రాయడం మొదలుపెడితే అది ఓ పెద్ద గ్రంథం అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమాలతో సమానంగా ఎఫైర్లు కొనసాగిస్తూ వచ్చాడు ఈ నటుడు. నయనతార, హన్సిక లాంటి హాట్ భామలు కూడా శింబు ఖాతాలో ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సుభిక్ష అనే మరో ముద్దుగుమ్మ కూడా చేరిందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది సుభిక్ష. ఏమాటకామాట పిల్ల కత్తిలా ఉంటుంది. త్వరలోనే శింబుతో సినిమా కూడా చేయబోతోంది. వీళ్లిద్దరూ కలిసి 2-3 సందర్భాల్లో, 2-3 చోట్ల కలిశారు. దీంతో మీడియాకు మంచి మసాలా దొరికేసింది. వెంటనే తమిళ వెబ్ సైట్లు మసాలా నూరడం స్టార్ట్ చేశారు. శింబు-సుభిక్ష మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ స్టోరీలు అల్లేశారు.

ఎప్పట్లానే ఈ కథనాల్ని శింబు లైట్ తీసుకున్నాడు. ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. సుభీక్ష మాత్రం క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటోంది. ఎక్కువ ఊహించుకోవద్దని మీడియాకు ఓ ఉచిత సలహా కూడా పడేసింది. హీరోయిన్లంతా స్టార్టింగ్ లో ఇలానే అంటారు కాబట్టి సుభీక్ష మాటల్ని లైట్ తీసుకోవచ్చు.

ఇక శింబు ఎఫైర్ల గురించి చెప్పుకుంటే.. నయనతారతో అతడు చాలా దూరం వెళ్లాడు. వీళ్లిద్దరి లిప్ కిస్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. నయన్ నుంచి విడిపోయిన తర్వాత హన్సికకు కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా మేటర్ చాలా దూరం వెళ్లింది. శింబు-హన్సిక ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడు శింబు లైఫ్ లోకి సుభిక్ష వచ్చిందంటున్నారు కోలీవుడ్ జనాలు.