యువ‌తి ఫిర్యాదు..గ‌జ‌ల్ శ్రీనివాస్ అరెస్ట్‌

Singer Ghazal Srinivas arrested in a sexual harrassment case
Tuesday, January 2, 2018 - 13:00

ప్రముఖ ర‌చ‌యిత‌, గాయ‌కుడు ‘గజల్‌’ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ రేడియో జాకీ ఫిర్యాదు చేశారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం పంజాగుట్ట పోలీసుల‌ను ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు కుమారి... ఆల‌య‌వాణి అనే వెబ్ రేడియోలో జాకీగానూ, ప్రొగ్రామింగ్ హెడ్‌గా పని చేస్తున్నారు. ఆ వెబ్ రేడియో కూడా గ‌జ‌ల్ శ్రీనివాస్‌కే చెందిన‌ద‌ని స‌మాచారం.

చాలా కాలంగా లైంగిక వేధింపుల‌కి గురి చేస్తున్న‌ట్లు ఆమె పోలీసుల‌కి తెలిపారు. ఐతే గ‌జ‌ల్ శ్రీనివాస్ మాత్రం ఆమె ఆరోప‌ణ‌ల‌ను కొట్టి పారేస్తున్నారు.

"ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు. నేను కొంత‌కాలంగా ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నా. నిన్న ఫిజియో థెర‌పిస్ట్ రాలేదు. దాంతో కుమారి నిన్న నాకు ఫిజియో థెర‌పీ చేసింది. దాన్ని త‌ప్పుడుగా చిత్రీక‌రిస్తున్నార‌"ని గ‌జ‌ల్ శ్రీనివాస్ పోలీసుల‌కి తెలిపారు.

"న‌గ్నంగా మ‌సాజ్ చేయమ‌ని వేధింపులు"

"సేవ్ టెంపుల్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ శ్రీనివాస్ ఉన్నాడు. యువ‌తిని మసాజ్ చేయమని, నగ్నంగా ఉండాలని వేధించాడు. దానికి సంబంధించిన అన్ని వీడియో రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నాయి. ఒప్పుకోకపోతే ఉద్యోగం తీసేస్తాన‌ని యువ‌తిని బెదిరించిన‌ట్లు ఫిర్యాదు అందింద,"ని పోలీసులు మీడియాకి తెలిపారు.