పోర్న్ ఫొటోలపై స్మిత మాట

Singer Smita says her Facebook page was hacked
Sunday, July 19, 2020 - 12:00

పాప్ సింగర్ స్మిత ఫేస్ బుక్ పేజీలో హఠాత్తుగా న్యూడ్ వీడియోలు, అశ్లీల ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో అంతా అవాక్కయ్యారు. విషయం తెలియక కొంతమంది స్మితపై ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే విషయం ఏంటంటే.. స్మిత ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయింది. ఆమె ఆ వీడియోల్ని డిలీట్ చేయలేకపోయింది.

ఆమె పేజీని హ్యాక్ చేసిన ఆకతాయిలు అందులో పోర్న్ కంటెంట్ పెట్టారు. వెంటనే ఫేస్ బుక్ ను సంప్రదించిన స్మిత, దాదాపు 24 గంటల తర్వాత తిరిగి తన ఖాతాను చేజిక్కించుకోగలిగారు. ఈ సందర్భంగా పోస్ట్ పెట్టిన స్మిత.. ఓ చెత్త రోజు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది.

"నా ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, చెత్త కంటెంట్ పెట్టడం మొదలుపెట్టారు. అది మళ్లీ నా స్వాధీనంలోకి వచ్చింది. ఫేస్ బుక్ టీమ్ తో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అసౌకర్యానికి చింతిస్తున్నాను."

ఇలా తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది స్మిత. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ గాయని.