60 ప్లస్ ...ఐనా భయం లేదు!

Sixty plus heroes are not fearing corona cases
Thursday, May 28, 2020 - 11:15

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 107 కేసులు నమోదు అయ్యాయి (అందులో సౌదీ నుంచి హైదరాబాద్ కి ల్యాండ్ అయిన వారి సంఖ్య ఎక్కువ కావడం కొంత ఊరట). ఐతే, పరిస్థితి పూర్తిగా కాంట్రోల్ లో ఉంది అనుకోవడానికి లేదు. లాక్డౌన్ అంటూనే ప్రభుత్వాలు అన్ని దుకాణాలు తెరుచుకోమంటున్నాయి. షూటింగ్ లకి కూడా గంట కొడుతున్నాయి. ఐతే పెరుగుతున్న కేసులతో హీరోల్లో కొంత దడ పెరుగుతోంది.

సీనియర్ హీరోలు అందరూ సిక్సిటీ ప్లస్ లో ఉన్నారు. 60 దాటిన వారు బయటికి అడుగుపెట్టకపోవడమే బెటర్ అని అందరూ చెప్తున్నారు. దాంతో... సీనియర్ హీరోల షూటింగులు ఇప్పుడు జరుగుతాయా అన్న అనుమానాలు కూడా మొదలు అవుతున్నాయి. "ఆచార్య", బాలకృష్ణ -బోయపాటి చిత్రాలతో పాటు వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలు ఇప్పుడే మొదలు కావు అన్న టాక్ నడుస్తోంది.

ఐతే చిరంజీవి చాలా ఆక్టివ్ గా ఉన్నారు. ఆయన ఇప్పటికి బయటికి వచ్చి మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. చారిటీ కార్యక్రమాలలో ముందు ఉన్నారు. సో ...మన సీనియర్ హీరోలు వయసు పరంగా పెద్దవారేమో కానీ ఎనర్జీలో సూపర్ ఆక్టివ్. సో... వీళ్ళకి భయం లేదు. షూటింగ్ లు పాల్గొనేందుకు ఎలాంటి జంకు లేదు.