కాజ‌ల్‌కి చాన్స్‌లు త‌గ్గుతున్నాయా

Slim chances for Kajal Aggarwal
Monday, April 15, 2019 - 17:00

మొన్నటి వరకు యమా బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ కి వెళ్లగా ఛాన్స్‌లు తగ్గుతున్నాయి. ఆమె తాజాగా నటించిన "సీత" ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే శర్వానంద్ సరసన సుధీర్ వ‌ర్మ‌ డైరక్షన్‌లో నటించిన మూవీ షూటింగ్ కూడా పూర్తి కావొస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలైతే ఆమె ఖాళీనే. మరో సినిమా ఐతే ఒప్పుకోలేదు.

కమల్ హాసన్ సరసన "భారతీయుడు 2" సినిమాని సైన్ చేసింది కానీ అది ఆగిపోయిందనేది టాక్. బడ్జెట్ సమస్యల వల్లే ఆగిందనేది గుసగుస. అది మళ్లీ మొదలవుతుందా అనేది చూడాలి. అంటే ప్రస్తుతం ఆమె చేతిలో మరో తెలుగు, తమిళ చిత్రం లేదు.

32 ఏళ్ల కాజల్ అగర్వాల్ ఇప్పటికే తెలుగులో 12 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకొంది. ఇప్పటికీ ఇన్ని సినిమాలు విడుదలకి రెడీగా ఉండడమే గొప్ప విషయమనే చెప్పాలి.

|

Error

The website encountered an unexpected error. Please try again later.