కరోనాపై స్మిత లాజిక్ ఇది

Smitha's weird logic about corona
Monday, March 30, 2020 - 18:30

కరోనాను అరికట్టడం కోసం సైంటిస్టులు చాలా చెబుతున్నారు. అది ఎలా వ్యాపిస్తుందో కూడా సైంటిఫిక్ గా చెబుతున్నారు. వాటిని అంగీకరిస్తూనే.. తనదైన భాష్యం చెబుతోంది వెటరన్ సింగర్ స్మిత. ఇవాళ్టి నుంచి రాహువు, చంద్రమార్గంలోకి వస్తున్నాడట.. అంతేకాదు, 3 గ్రహాలు ఒకే లైన్ లోకి వస్తున్నాయట. కాబట్టి కరోనా మరింత స్ప్రెడ్ అవుతుందంటోంది స్మిత.

"రాబోయే 5 రోజులు చాలా కీలకం. లాజికల్ గా వైరస్ బాగా ఎక్కువ వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఆధ్యాత్మికంగా కూడా ఇదే నిజం. రాహువు, చంద్రమార్గంలోకి వస్తున్నాడు. శని, గురు, బుధ గ్రహాలు ఒకే రేఖ మీదకు వస్తున్నాయి.  ఇది చాలా ప్రమాదం. వైరస్ మరింత వేగంగా విస్తరించడానికి ఈ మూడు గ్రహాల గతులు చాలా కీలకం. కాబట్టి ఈ టైమ్ లో మనం బయటకు వెళ్లకపోవడం చాలా ఇంపార్టెంట్. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు బయటకు వెళ్లొద్దు. సరుకులు కొనడానికి కూడా వెళ్లొద్దు. ఇంట్లో ఉన్నవాటితోనే సర్దుకోండి."

చూశారుగా.. ఇది స్మిత లాజిక్. ఈ కోణంలో కూడా ఆలోచించే తెలుగు వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం స్మిత ఈ వెర్షన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. వేడినీళ్లలో వాము, తులసి, పసుపు వేసి ఆవిరి పట్టి.. కాసేపటి తర్వాత ముఖం కడుక్కుంటే కరోనా రాదంటోంది స్మిత. దీనిలో ఉన్న సింటిఫిక్ కోణం ఆ దేవుడికే తెలియాలి. వాట్సాప్ లో వచ్చే ప్రతి అప్డేట్ ని నిజం అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. స్మిత మాట కూడా అదే బాపతులా ఉంది.  నమ్మేవాళ్లుంటే నమ్మొచ్చు.