ఈ తెలుగు భామ మెప్పిస్తుందా?

Sobhita Dulipala debuts in Goodachari
Tuesday, July 17, 2018 - 15:30

శోభిత ధూళిపాల గురించి నెటిజ‌నుల‌కి తెలుసు. ఆమె అంద‌చందాలు అలాంటివి మ‌రి. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. కొన్ని టైటిల్స్ కూడా గెలుచుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శోభిత‌. ఆమె న‌టించిన రామ‌న్ రాఘ‌వ్ అనే బాలీవుడ్ సినిమా బాగా పాపుల‌ర్‌.

తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత "గూఢచారి" సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతోంది. అడివి శేషు హీరోగా రూపొందిన యాక్ష‌న్ థ్రిల‌ర్‌..శోభిత‌. ట్ర‌యిల‌ర్‌లోనే ఆమె ఘాటైన ముద్దుల‌తో కిరాక్ పుట్టించింది. రీసెంట్‌గా ముద్దుల సీన్ల‌తో హీరోయిన్లు కేక పుట్టిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100లో పాయ‌ల్ రాజ్‌పుత్ అలాగే చేసి సినిమా విజ‌యానికి కార‌ణ‌మైంది. మ‌రి శోభిత కూడా అలాగే ఆక‌ట్టుకుంటుందా?

"గూఢచారి" వ‌చ్చే నెల మూడున విడుద‌ల కానుంది.  ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. క్ష‌ణం సినిమా త‌ర్వాత అడవి శేషు అందిస్తున్న మూవీ కావ‌డంతో దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.