'సోలో'లో అల మ్యూజిక్ బిట్టా?

Solo Bratuhuke So Better theme video relased
Thursday, February 13, 2020 - 18:30

సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్ షురూ చేశాడు తన కొత్త సినిమాకి ఇప్పటినుంచే. మే 1న రిలీజ్ కానున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా మూవీ థీమ్ ఇది అంటూ లేటెస్టుగా వీడియో రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినప్పుడు...  సోలో బ్రతుకే సూపర్ అనుకునే హీరో ఎలా ప్రేమలో పడ్డాడనే కాన్సెప్ట్ ను సినిమాలో చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు రిలీజైన థీమ్ వీడియోని బట్టి చూస్తే హీరో సింగిల్ లైఫ్ కోసం అందరితో మింగిల్ అవుతూ ఒక ఉద్యమం చేస్తున్నట్లు కనిపిస్తోంది.  అదే పేరుతో ఓ క్లబ్ ఓపెన్ చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగుతుంటాడత. ఇలా సోలో బ్రతుకే సో బెటర్ అనే పదాన్ని సినిమాలో కేవలం ఓ టైటిల్ గా కాకుండా.. ఓ ఆర్గనైజేషన్ గా చూపించి నిజంగానే అందరికీ షాకిచ్చారు మేకర్స్.

థీమ్ వీడియోలో సాయితేజ్ లుక్, ప్రజెన్స్ కూడా బాగుంది. ఎటొచ్చి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ కు దాదాపు ఇదే ఇన్ స్ట్రుమెంట్స్ తో, ఇదే ట్యూన్ ఇచ్చాడు తమన్. కొన్నాళ్ళు తమన్ కి ఈ హ్యాంగోవర్ తప్పదేమో. 

లాస్ట్ ఇయర్ చిత్రలహరి అనే సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించి, ఏడాది చివర్లో ప్రతి రోజు పండగే తో హిట్ అందుకున్నాడు సాయి తేజు. ఈ ఏడాది సోలోగా ఒకే మూవీని రిలీజ్ చేస్తున్నాడు.