సెంటిమెంట్ రాజేసింది.. బుక్కయింది

Sonakshi Sinha's trick backfires
Monday, July 6, 2020 - 14:30

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపొటిజం అంశం తెరపైకొచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురైన వ్యక్తి సోనాక్షి సిన్హా. అందం, ఫిజిక్ లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ తో సల్మాన్ లాంటి హీరోల సరసన ఈమె ఛాన్స్ కొట్టేసిందని, ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోందని ఓ రేంజ్ లో ఈమెను ఆడుకున్నారు. ఓ దశలో తన సోషల్ మీడియా ఎకౌంట్ ను సోనాక్షి సిన్హా డిజేబుల్ చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థంచేసుకోవచ్చు.

ఈ క్రమంలో తనపై సింపతీ పెరిగేలా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. తను కూడా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా వేధింపులు ఎదుర్కొన్నానని చెబుతోంది సోనాక్షి. కాలేజ్ డేస్ లో చాలా లావుగా ఉండేదాన్నని, ఒక టైమ్ లో 90 కిలోల బరువుతో ఉంటే ఫ్రెండ్స్ అంతా తనను చూసి నవ్వేవారని, కొంతమంది ఎగతాళి చేసేవారని చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఎన్నో అవమానాలు భరించి, కసితో బరువు తగ్గి కష్టపడి హీరోయిన్  అయ్యానని చెప్పుకొచ్చింది సోనాక్షి.

అయితే ఆమె ఎంత సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించినా అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నువ్వు నీ బరువు తగ్గడానికే అంతగా కష్టపడితే సుశాంత్ లాంటి వాళ్ళు అవకాశాల కోసం ఇంకెంత కష్టపడి ఉంటారోనని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోనాక్షి మరోసారి సైలెంట్ అయిపోయింది.