నే(మే)టి పాట: గాలివాలుగా

Song Lyrics: Gaali Vaaluga from Agnyaathavaasi
Thursday, December 14, 2017 - 10:45

“బయటకొచ్చి చూస్తే” అనే సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది.  “గాలివాలుగా” అనే పాటకు రిలీజైన వెంటనే అంత రెస్పాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఇదే పెద్ద హిట్ అవుతోంది. స్టార్టింగ్ లో బాగాలేదన్న వాళ్లే ఇప్పుడీ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వింటున్నారు. అలా “గాలివాలుగా” సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే టాప్ చార్టుల్లో చేరిపోయింది.

ఇప్పటివరకు ఎన్నో మెలొడీస్ విన్న టాలీవుడ్ ఆడియన్స్ కు “గాలివాలుగా” అనే ఈ పాట మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించింది.  ఇదే పాటను టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎవరైనా బాణీ కట్టి ఉంటే రొటీన్ లో కలిసిపోయేదేమో. కానీ అనిరుధ్ ఈ పాటకు ఓ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాడు. మెలొడీకి చిన్నపాటి వేగాన్నిస్తే ఎలా ఉంటుందో “గాలివాలుగా” సాంగ్ చూపించింది.

ఇక ఈ పాటలో సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి  మరోసారి త‌న క‌లంబ‌లం చూపించారు. రామ‌జోగ‌య్య, శ్రీమ‌ణి వంటి నేటి త‌రం ర‌చ‌యిత‌లెంద‌రున్నా... ఈ పాటని సిరివెన్నెల‌తోనే త్రివిక్ర‌మ్ ఎందుకు రాయించారో పాట వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.  సిరివెన్నెల‌కి ఇలాంటి పాట‌లు జుజుబీల్లాంటివి. ఆయ‌న రాసిన ఎన్నో గొప్ప పాటల‌కి ఇది స‌రితూగుతుందా అన్న ప‌క్క‌న పెడితే హీరో సోలో రొమాంటిక్ గీతాల్లో ఇది ప్ర‌త్యేక‌మైన‌ది అని చెప్పాలి. ఈ పాట‌లో సిరివెన్నెల ఒక ఫ్రీ స్ట‌యిల్‌ని చూపించారు. తెలుగు సినిమా పాట‌ల‌న్నీ దాదాపుగా ఒక స్ర్ట‌క్చ‌ర్‌లోనే సాగుతుంటాయి. పాశ్చ‌త్య గీతాలు మాత్రం రైమింగ్ శైలి సాహిత్యాన్ని వ‌దిలి ఫ్రీ స్ట‌యిల్‌కి ఎపుడో వెళ్లిపోయాయి. సీతారామశాస్ర్తిగారు ఇందులో కొంత మేరకు ఆ ప్ర‌య‌త్నం చేశారు. అది ఈ పాట‌లోని అస‌లైన ప్ర‌త్యేక‌త‌.

“గాలివాలుగా” సాంగ్ ను హమ్మింగ్ చేస్తున్న వాళ్ల కోసం ఆ పాట లిరిక్స్ ను ఇక్కడ అందిస్తున్నాం.

Song: Gaali Vaaluga
Film: Agnyaathavaasi
Lyrics: Sirivennela Seetharama Sastry
Music director and singer: Anirudh Ravichander

పల్లవి:

గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా.. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా.. చెలి ఇలా దొరికితే నీ స్నేహం

ఏం చేశావే
మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేశావే
గాలులకు గంధంరాసి పైకి విసురుతావే

ఏం చేశావే
మెరుపు చురకత్తుల్ని దూసి పడుచు ఎదలో దించేశావే
తలపునే తునకలు చేసి తపన పెంచుతావే..

నడిచే హరివిల్లా
నను నువ్విల్లా
నులిపెడుతుంటే ఎలా
అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా..
నిలు నిలు నిలు నిలబడు పిల్లా గాలిపటంలా ఎగరకే అల్లా..
సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా

చూస్తేనే.. గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనది నా గుండెకు తగిలి
తపించిపోనా.. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా.. చెలి ఇలా దొరికితే నీ స్నేహం
నీ దేహం
మ్‌మ్‌..మ్‌మ్‌...
 
చరణం:

కొరా కొరా  కోపమేలా.. చురా చురా చూపులేలా..
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే

అలా అని జాలిపడవే పాపం కదే ప్రేయసి..
సరే అని చల్లబడవె ఓసీ పిశాచీ
నువ్వు అలా తిప్పుకుంటూ ఊగిపోకే ఊర్వశీ.. అలా అలా నవ్వుతావేం మీసం మెలేసి
ఎన్నాళ్లింకా ఊరికే ఊహల్లో ఉంటా.
పెంకి పిల్లా... చాల్లే మానుకో ఇక ముందూ వెనక చూసుకోని పంతం
ఆలోచిద్దాం.. చక్కగా కూర్చొని చర్చిద్దాం.. చాలు యుద్ధం రాజీ కొద్దాం
బుద్ధిగా కలిసొస్తే నీకేమిటంటా కష్టం!!

నడిచే హరివిల్లా
నను నువ్విల్లా
నులిపెడుతుంటే ఎల్లా

అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా..
నిల నిల నిల నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా..
సుకుమారి సొగసును అల్లా ఒంటరిగా వదలాలా

ఏం చేయాలో మరి.. గాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనది నా గుండెకు తగిలి
తపించిపోనా.. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా.. చెలి ఇలా దొరికితే నీ స్నేహం
మ్‌మ్‌..మ్‌మ్‌...

త‌రారా త‌రాత‌రాత‌రా త‌రారా...

త‌రారా త‌రాత‌రాత‌రా త‌రారా...