సోనియా పెళ్లిళ్లు జరిపిస్తుందట

Soniya Agarwal launches an event company
Saturday, July 25, 2020 - 15:45

మూడు రోజుల నుంచి ఓ రేంజ్ లో ఊరించింది "7/g బృందావనకాలనీ" హీరోయిన్ సోనియా అగర్వాల్. రోజుకో వెడ్డింగ్ వీడియో, ఫొటో పెట్టి తెగ కన్ఫ్యూజ్ చేసింది. దీంతో కొన్నాళ్లుగా సింగిల్ గా ఉంటున్న ఈమె రెండో పెళ్లికి రెడీ అయినట్టుందని అంతా అనుకున్నారు. అయితే ఈరోజు ఆ సస్పెన్స్ కు తెరదించింది సోనియా అగర్వాల్.

తను పెళ్లి చేసుకోదట కానీ పెళ్లిళ్లు మాత్రం చేస్తుందట. అవును.. సరికొత్త వెడ్డింగ్ అండ్ ఈవెంట్ కంపెనీని స్టార్ట్ చేసింది సోనియా. కేవలం ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించేందుకే.. 3 రోజుల నుంచి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు పెట్టింది.

తనకు బాగా తెలిసిన మరో నలుగురితో కలిసి "టేల్ ఆఫ్ టు" అనే వెడ్డింగ్ అండ్ ఈవెంట్ కంపెనీని స్టార్ట్ చేసింది సోనియా. ఆమె పెళ్లి చేసుకుంటుందేమో అని 3 రోజులుగా ఎదురుచూసిన జనాలకు ఇలా షాకిచ్చింది ఈ బృందానవ కాలనీ పిల్ల.