పూరి దూకుడుకి కరోనా కళ్లెం

Speed breakers for Puri Jagannadh's film
Tuesday, July 7, 2020 - 19:30

స్పీడ్ ...పూరి స్పెషలిటీ. వేగంగా కథలు రాస్తాడు. అంతే స్పీడ్ గా సినిమాలు పూర్తి చేస్తాడు. హీరో ఎవరైనా జెట్ స్పీడ్ తో షూటింగ్ కంప్లీట్ చేయడం పూరి జగన్నాధ్ స్టయిల్. మహేష్ బాబు లాంటి హీరోతోనే 45 రోజుల్లో బిజినెస్ మేన్ లాంటి సినిమా పూర్తిచేశాడంటే పూరి ప్లానింగ్, అతడి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి డైరక్టర్ దూకుడుకు ఇప్పుడు కరోనా కళ్లెం వేసింది.

కరోనా/లాక్ డౌన్ ఎఫెక్ట్ తో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా షూటింగ్ ను పూరి జగన్నాధ్ ఆపేయాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమా కోసం చాన్నాళ్లు వెయిట్ చేశాడు పూరి. ఇది ఆయన శైలికి భిన్నం. ఇస్మార్ట్ శంకర్ లాంటి డబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా కేవలం విజయ్ దేవరకొండ కోసం ఆల్ మోస్ట్ 8 నెలలు ఆగాడు పూరి.

చకచకా షూటింగ్ పూర్తిచేసి దసరా సరికి సినిమాను రిలీజ్ చేసి ఆ గ్యాప్ ను భర్తీ చేయాలని అనుకున్నాడు పూరి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వచ్చిపడింది. సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలా పూరి-విజయ్ దేవరకొండల తొలి పాన్-ఇండియా సినిమాకు కరోనా కళ్లెం వేసింది.

ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లాక్ డౌన్ కు ముందు ముంబయిలో షూట్ చేశాడు పూరి. పాన్-ఇండియా సినిమా కాబట్టి అక్కడే పెద్ద ఆఫీస్ తెరిచాడు. అలా ముంబయిలని తన ఆఫీస్ లోనే 3 నెలలుగా ఉంటున్నాడు.