ఇప్పటికీ బన్నీ సలహా పాటిస్తా

Sree Vishnu reveals a secret
Monday, May 4, 2020 - 10:15

కొన్ని విషయాల్ని కొందరు చెప్పేవరకు నమ్మలేం. చెప్పిన తర్వాత అవునా, నిజమా అని ఆశ్చర్యపోవడం మన వంతు. హీరో శ్రీవిష్ణు కూడా అలాంటి ఆశ్చర్యపోయే విషయాన్నే చెప్పాడు. తన కెరీర్ ఓ షేప్ తీసుకోవడానికి, కథల విషయంలో తన ఎంపిక వెనక హీరో అల్లు అర్జున్ ఉన్నాడనే విషయాన్ని బయపెట్టాడు శ్రీవిష్ణు.

నిజంగా ఇది కాస్త ఆశ్చర్యపడే విషయమే.

"ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తర్వాత బన్నీ ఫోన్ చేసి రమ్మన్నారు. అప్పుడు ఆయన రేసుగుర్రం షూటింగ్ లో ఉన్నారు. షాట్ గ్యాప్ లో నాతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలు మాట్లాడారు. నా ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదే టైమ్ లో ఓ సలహా కూడా ఇచ్చారు. రెగ్యులర్ హీరోల టైపులో కమర్షియల్ సినిమాలు చేయొద్దన్నారు. ఉదాహరణగా విజయ్ సేతుపతి, శివ కార్తికేయ గురించి చెప్పారు. అప్పట్నుంచి అదే ఫాలో అవుతున్నాను."

ఇలా తన కథల ఎంపిక వెనక అల్లు అర్జున్ సలహా ప్రభావం ఉందనే విషయాన్ని బయటపెట్టాడు శ్రీవిష్ణు. 

కేవలం బన్నీ సలహా మేరకే చాలా కమర్షియల్ కథల్ని వదిలేశానని,.. కాస్త కొత్తగా అనిపించే పాత్రల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన వర్క్ శాటిస్ ఫాక్షన్ కు బన్నీనే కారణం అంటున్నాడు.