బిగ్ బాస్ ఎవరో చెప్పేసిన శ్రీముఖి

Sreemukhi confirms the host of Bigg Boss 4
Thursday, July 23, 2020 - 19:45

బిగ్ బాస్ సీజన్-4కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అన్-అఫీషియల్ గా ఇది ఫిక్స్ అయింది కూడా. కానీ స్టార్ మా యాజమాన్యం నుంచి మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడిదే విషయాన్ని శ్రీముఖి కూడా చెప్పేసింది. సీజన్-3కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే, సీజన్-4కు కూడా వస్తున్నారంటూ బయటపెట్టింది శ్రీముఖి.

"మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి కదా. అవన్నీ వంద శాతం కరెక్ట్. సీజన్-4కు కూడా నాగార్జున గారే హోస్ట్ అని ఆల్ మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అవి నిజమని నేను కూడా నమ్ముతున్నాను."

సీజన్-3లో బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన శ్రీముఖి, ఫైనల్స్ వరకు వచ్చింది. ఆఖరి నిమిషంలో టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ ఎగరేసుకుపోవడంతో, రన్నరప్ గా మిగిలిపోయింది. బిగ్ బాస్ నిర్వహకులతో ఇప్పటికీ టచ్ లో ఉండే శ్రీముఖి చెప్పిందంటే.. అది కచ్చితంగా నిజం అవుతుంది. సో... సీజన్-4కు నాగార్జున ఫిక్స్.