ఎఫైర్లు లేవంటున్న రాములమ్మ

Sreemukhi denies being in love relationship
Thursday, February 27, 2020 - 22:30

యాంకర్ శ్రీముఖి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, ఆమె హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ టెక్కీతో డేటింగ్ చేస్తోందంటూ వరుసగా కథనాలు వచ్చాయి. అంతా ఊహించినట్టే శ్రీముఖి ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తనకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవంటోంది. ఇక్కడితో ఆగలేదు ఈ భామ. తను మాట్లాడిన మాటల్ని జర్నలిస్టులు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఇంగ్లిష్ గ్రామర్ కూడా చెప్పుకొచ్చింది.

వీడియోలో తను పాస్ట్ టెన్స్ (భూతకాలం)లో మాట్లాడానని, దాన్ని జర్నలిస్టులు ప్రజెంట్ టెన్స్ (వర్తమానం కాలం)గా అర్థం చేసుకున్నారని అంటోంది శ్రీముఖి. ఇలా చెబుతూనే తను ఒకప్పుడు ఎఫైర్ లో ఉన్నాననే విషయాన్ని శ్రీముఖి అంగీకరించినట్టయింది. అయితే ప్రస్తుతం మాత్రం తనకు ఎలాంటి ఎపైర్లు లేవని, ప్రతి రోజూ నేను షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది. ఇకపై తనకు సంబంధించి వార్తలు రాసేటప్పుడు తనను ఓసారి సంప్రదించాలంటోంది శ్రీముఖి.

అయినా ఈ యాంకర్లు, హీరోయిన్లంతా ఇలానే మాట్లాడతారు. ఏమీ లేదన్నట్టు కలరింగ్ ఇస్తారు. సడెన్ గా ఓ రోజు పొద్దున్నే ఇతడే నా శ్రీవారు అంటూ ఫొటోలు పోస్ట్ చేస్తారు. కాబట్టి నిప్పులేనిదే పొగరాదు. శ్రీముఖి ఖండించినంత మాత్రాన ఈ పుకార్లు ఆగేలా లేవు.