శ్రీముఖిని మొత్తం ఊడ్చేశారట

Sreemukhi reveals her casino experience
Saturday, June 20, 2020 - 12:45

కొంతమందికి కొన్ని బలహీనతలుంటాయి. యాంకర్ కమ్ నటి శ్రీముఖికి కూడా అలాంటి బలహీనత ఉంది. తనకు క్యాసినోలకు వెళ్లడం వీక్ నెస్. ఆ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టింది.

"క్యాసినోలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు క్యాసినోలకు వెళ్తుంటాను. ఫస్ట్ టైమ్ ఆడినప్పుడు వేరే వాళ్ల డబ్బుతో ఆడి గెలిచాను. రెండోసారి నా డబ్బులే పెట్టాను. కొంచెం లాభాలొచ్చాయి. మూడోసారి మొత్తం పెట్టేశాను. మొత్తం ఊడ్చుకుపోయింది. ఇక క్యాసినోల్లో ఆడకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను."

అయితే అంత జరిగినా ఇప్పటికీ క్యాసినోలకు వెళ్తానంటోంది శ్రీముఖి. ఎక్కువగా బెట్ చేయనని, లిమిటెడ్ గా పెడతానని చెబుతోంది. 

చూడండి  - శ్రీముఖి ఫొటోస్

ఇక తన ముద్దుపేర్లు గురించి చెబుతూ.. అంతా తనను రాములమ్మ అని పిలిస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

"మా నాన్నమ్మ వాళ్లు గుడియా అని పిలుస్తారు. మమ్మీ-డాడీ పాప అని పిలుస్తారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా రాములమ్మ అని పిలుస్తున్నారు. హీరోలకు మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ లాంటి బిరుదులున్నాయి. యాంకర్లకు అలాంటి బిరుదులు పెద్దగా ఎవ్వరూ పెట్టరు. అలాంటిది నాకు రాములమ్మ అనే బిరుదు పెట్టారు. అంతా బుల్లితెర రాములమ్మ అని పిలిస్తే చాలా గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా విజయశాంతి గారు స్వయంగా రాములమ్మ అని చెప్పడం చాలా హ్యాపీ."

అమ్మా-నాన్న కాకుండా ఎవరైనా తనను పాప అని పిలిస్తే నచ్చదంటోంది శ్రీముఖి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలమంది, హీరోయిన్ల పేర్లు గుర్తుకురాక పాప అని పిలుస్తుంటారని.. అందుకే ఆ పేరుతో పరిశ్రమలో పిలిపించుకోవడం ఇష్టం లేదంటోంది.

చూడండి  - శ్రీముఖి ఇంటర్వ్యూ