రాములమ్మ గ్లామర్ షో అదుర్స్

Sreemukhi turns glamorous
Friday, January 31, 2020 - 19:45

భారీ అందాల శ్రీముఖి ఫొటోషూట్స్ జనాలకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఆమె నుంచి లేటెస్ట్ స్టిల్స్ వస్తూనే ఉంటాయి. ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా, గ్లామర్ గా దుస్తులు ధరించినా స్కిన్ షోకు మాత్రం ఆమె కాస్త దూరం. అయితే ఇప్పుడా కట్టుబాటును కూడా గట్టున పెట్టినట్టుంది రాములమ్మ అలియాస్ శ్రీముఖి. తాజాగా రిలీజైన స్టిల్స్ చూస్తే మతిపోవాల్సిందే.

పైపై అందాల్ని మరింత అందంగా ప్రదర్శిస్తూ శ్రీముఖి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఘాటు అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆమె ఇంత హాట్ గా కనిపిస్తుందని ఊహించని జనాలు ప్రస్తుతం షాక్ లో ఉంటూనే, ఈ స్టిల్స్ ను కళ్లారా ఆస్వాదిస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన ఏ ఫొటోలో ఇంత హాట్ నెస్ లేదు. అందుకే ఇది అంత వైరల్ అయింది.

శ్రీముఖిని ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూడలేదు ఆమె బుల్లితెర అభిమానులు. తన ఇనస్టాగ్రామ్ లో శ్రీముఖి పెట్టిన ఈ ఎద అందాలు కుర్రకారుని రెచ్చగొడుతున్నాయి. తాజా ఫొటోషూట్ తో ఆమె తన స్కిన్ షోకు సంబంధించిన కండిషన్లను కాస్త సడలించిందనే విషయం అర్థమౌతూనే ఉంది. ఇకపై బుల్లితెరపై కూడా ఈమె ఇంతే హాట్ గా కనిపిస్తుందేమో.