ఆ యాంకర్ అలా కక్ష తీర్చుకుంది

Sreemukhi's Batuku Jatkabandi parody
Friday, April 17, 2020 - 22:45

యాంకర్ శ్రీముఖి, జీ తెలుగు మధ్య వివాదం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమెతో ఓ పెద్ద కార్యక్రమం ప్లాన్ చేసింది జీ తెలుగు. అంతేకాదు.. ఆమెతో ఓ అవార్డ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేసింది. అంతా సెట్ అయిందనే టైమ్ కు శ్రీముఖి, బిగ్ బాస్ షోకు వెళ్లిపోయింది. ఆ వెంటనే ఆమెను అన్ని కార్యక్రమాల నుంచి తొలిగించింది సదరు సంస్థ. అంతేకాదు.. అప్ కమింగ్ ప్రొగ్రామ్స్ పై కూడా అన్-అఫీషియల్ బ్యాన్ విధించింది.

దీంతో శ్రీముఖికి కూడా సదరు ఛానెల్ పై కోపమొచ్చింది. తను ఏం చేయగలదో అదే చేసి చూపించింది. జీ తెలుగులో సూపర్ హిట్ ప్రొగ్రామ్ అయిన బతుకు జట్కాబండికి పేరడీ చేసి వదిలింది. దీనికి బతుకు బలైపోయిన బండి అని పేరు పెట్టింది. కార్యక్రమంలో రోజా చేసిన పాత్రను శ్రీముఖి పోషించింది. బాధితుడిగా జబర్దస్త్ లో చేస్తున్న అవినాష్ ను పెట్టింది. ప్రస్తుతం జబర్దస్త్ టీమ్ కు జీ తెలుగు లో అదిరింది టీమ్ (నాగబాబు నేతృత్వంలో) కు మధ్య మంచి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఏరికోరి అవినాష్ ను పెట్టినట్టున్నారు.

ఇలా బతుకు జట్కాబండికి పేరడీ చేసి దాన్ని తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది శ్రీముఖి. ఈ వీడియో చూసిన చాలామంది మీడియా జనం.. ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యే అంటున్నారు. అటు శ్రీముఖి మాత్రం తన వీడియోకు ఫుల్ పబ్లిసిటీ ఇస్తోంది. అయితే వీడియోలో రోజా పాత్రతో మాత్రం ఆమె ఎలాంటి కామెడీ చేయలేదు.