మ‌ద‌ర్‌బోర్డ్ కొంప‌ముంచింది!

Sri Reddy now backtracks
Wednesday, April 18, 2018 - 18:30

ఏ టీవీ ఆన్ చేసినా..శ్రీరెడ్డి గురించే చ‌ర్చ‌. సోష‌ల్ మీడియాలోనూ అదే ర‌చ్చ‌. శ్రీరెడ్డి వ్య‌వ‌హ‌ర‌శైలి, ఆమె పాత వీడియోలు చూసిన వారికెవ‌రికైనా రోత పుడుతుంది. ఐతే ఆమె లేవ‌నెత్తిన కొన్ని అంశాలు స‌మంజ‌స‌మే. అలాగే క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య మాత్రం ప‌ట్ల అంద‌రూ స్పందించారు. పౌర స‌మాజం ఆమెకి మ‌ద్ద‌తు తెలిపింది.

ఆమె వాడిన భాష ప‌ట్ల అభ్యంత‌రం ఉన్నా.. ఆమె లేవనెత్తిన స‌మ‌స్యని ఎవ‌రూ కాద‌న‌లేని క‌ఠోర‌ వాస్త‌వ‌మే. దాంతో ఆమెకి కొంత సానుభూతి వ‌చ్చింది. ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియాలో, మ‌హిళాలోకంలో హీరో వ‌ర్షిప్ ద‌క్కింది. ఐతే దాన్ని ఆమె నిలుపుకోలేక‌పోయింది. కొద్ది రోజుల‌కే తుస్సుమ‌నిపించింది త‌న అతి ప్ర‌వ‌ర్త‌న‌తో.

ఎవ‌రైనా ఆమెని ప్రేరేపించారా లేక స్వ‌యంగా స్పందించిందా అనేది తెలియ‌దు కానీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అత్యంత హేయ‌మైన భాష‌లో తిట్ట‌డం జుగుప్ప‌క‌రం. శ‌త్రువుని కూడా అలా తిట్ట‌రు. ఆఖ‌రికి ప‌వ‌ర్‌స్టార్‌ని రాజ‌కీయంగా వ్య‌తిరేకించేవారు కూడా శ్రీరెడ్డిని ఈస‌డించుకున్నారు. పోనీ, ప‌వ‌ర్‌స్టార్ ఆమెని ఏమైనా అన‌రాని మాట అన్నారా అంటే అదీ లేదు. న్యాయ‌పోరాటం చేయ‌మ్మా నా మ‌ద్ద‌తు ఉంటుంది అని చెప్పాడు. అంతే. ఆ మాట‌కి, ఆమె స్పందించిన తీరుకి అస్స‌లు పొంత‌న‌లేదు. బుర్ర ఉన్నవాళ్లు ఎవ‌రూ అలా రియాక్ట్ కారు.

మ‌గవాళ్లు కూడా వాడేందుకు సిగ్గుప‌డే మ‌ద‌ర్‌బోర్డ్ (ఆమె వాడిన ఆ ప‌దాన్ని అలా చెపుతుంటారు మ‌రీ డైర‌క్ట్‌గా అన‌లేని వాళ్లు) తిట్టుని ఆమె వాడింది. అంద‌రూ ఆమెని త‌ప్పుప‌ట్ట‌డమే కాదు ఆమెకి దూరంగా జ‌రిగారు. ఈ మాట ఆమెని పాతాళానికి దించింది.

రెండు రోజుల్లోనే సీన్ మారింది. ఇపుడు శ్రీరెడ్డిపై ఎవ‌రికీ సానుభూతి లేదు. మ‌హిళాసంఘాలు కూడా దూరం జ‌రుగుతున్నాయి. దాంతో శ్రీరెడ్డి ఇపుడు ప‌వ‌ర్‌స్టార్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అంతేకాదు, ఒక వ్య‌క్తి (ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దీని వెనుక ఉన్న‌ట్లు గాసిప్‌) వ‌ల్ల తాను క్యారీ అయి ఇలా చేశాన‌ని ఇపుడు చెప్పుకుంటోంది. కానీ జ‌ర‌గాల్సిన డ్యామేజీ మొత్తం జ‌రిగింది.

గ‌తంలో ఆమె ప‌వ‌ర్‌స్టార్ పాద‌దాసిగా ఉంటే చాలు, ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటే త‌న జ‌న్మ ధ‌న్య‌మైన‌ట్లే అన్న పాత వీడియోలు కూడా ఇపుడు బ‌య‌టికి వ‌చ్చాయి.