నా ఫస్ట్ నైట్ ప్లేస్ మాయమవుతోంది

Sri Reddy posts about Abhi Ram and her first night
Tuesday, February 18, 2020 - 16:15

శ్రీ రెడ్డి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వివాదాస్పద కామెంట్లు పెట్టడం షురూ చేసింది. గతంలో ఆమె ... నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ పై ఆరోపణలు చేసింది. తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, తనను వాడుకొని అభిరాం మోసం చేశాడని చెప్పింది. దానికి ప్రూఫ్ గా అభిరామ్, శ్రీ రెడ్డి మధ్య చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను అలాగే ఒకరి పెదాలను ఒకరు కోరుకుంటున్న స్టిల్స్ ని రిలీజ్ చేసింది. 

ఇప్పటివరకు సురేష్ బాబు కుటుంబం ఆమె ఆరోపణలని తోసిపుచ్చలేదు. సైలెంట్ గా అదే సద్దుమణిగి పోతుందన్నట్లుగా బిహేవ్ చేసింది. అదే జరిగింది ఇప్పుడు మళ్లీ శ్రీ రెడ్డి అదే విషయాన్ని కెలికింది. 

హైదరాబాద్ లోని నానక్ రామ గూడలోని రామానాయుడు సినీ విలెజ్ తో ఉన్న సినిమా స్టూడియోని కూలగొట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు అని మీడియాలో వచ్చిన వార్తలకి స్పందించింది శ్రీ రెడ్డి. "నేను, అభి రామ్ ఫస్ట్ నైట్ జరుపుకున్న రామానాయుడు స్టూడియో త్వరలోనే మాయం అయిపోతోంది... " అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకొంది. అంటే మరోసారి అభి రామ్ ఎపిసోడు ని జనాలకి గుర్తు చేసింది శ్రీ రెడ్డి