నాలుగు భాషల్లో శ్రీదేవి డబ్బింగ్‌

Sridevi to dub her voice in four languages for Mom
Thursday, May 25, 2017 - 13:45

శ్రీదేవి న‌టించిన కొత్త మూవీ. 'మామ్‌'  ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. శ్రీదేవి నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెబుతుండడం విశేషం.

నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న శ్రీదేవి 'తునైవన్‌' అనే తమిళ్‌ చిత్రంలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో నటించిన శ్రీదేవికి 'మామ్‌' 300వ చిత్రం. శ్రీదేవి మొదటి చిత్రం విడుదలైన తేదీ జూలై 7, 1967. 

శ్రీదేవికి దేశవ్యాప్తంగా వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్‌, మలయాళంలలో కూడా 'మామ్‌' చిత్రాన్ని ఒకేరోజున విడుదల చేస్తున్నారు. త‌న‌కి ఇది 300వ సినిమా కావడం, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండ‌డ‌, తన మొదటి సినిమా విడుదలైన రోజునే 'మామ్ విడుద‌ల అవుతుండ‌డం వంటి ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లోనూ తన డబ్బింగ్ చెప్పుకుంటోంది.

తెలుగులో ఈ సినిమాని కోన వెంక‌ట్ అందిస్తున్నాడు.