హాట్ టాపిక్ గా మారిన కార్తికేయ

SS Karthikeya becomes a hot topic
Saturday, May 9, 2020 - 16:45

రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా మారి అప్పట్లో ఆకాశవాణి అనే సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి కార్తికేయ తప్పుకున్నాడు. తను ఆకాశవాణి నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కార్తికేయ స్వయంగా ప్రకటించాడు.

నిజానికి ఈ సినిమాను అశ్విన్, కార్తికేయ కలిసి స్టార్ట్ చేశారు. ఇద్దరూ మంచి స్నేహితులే. కాకపోతే ఆకాశవాణితో పాటు మరో సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న కార్తికేయ.. రెండు సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాడు. అందుకే ఆకాశవాణి నిర్మాణ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. తన వాటాను AU&I స్టుడియోస్ అధినేత పద్మనాభరెడ్డికి అప్పగించాడు.

అటు మరో నిర్మాత, కార్తికేయ స్నేహితుడు అశ్విన్ కూడా దీనిపై స్పందించాడు. సహృద్భావ వాతావరణంలోనే కార్తికేయ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని.. అతడు తప్పుకోవడం వల్ల ప్రాజెక్టు అవుట్ పుట్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టంచేశాడు. కాస్త లేట్ అయినా మంచి క్వాలిటీతో ప్రేక్షకుల్ని పలకరిస్తామంటున్నాడు అశ్విన్.

ప్రస్తుతం కార్తికేయ తప్పుకున్న విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అతడు ఉన్నఫలంగా ఎందుకు ఆకాశవాణి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనే అంశంపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు.