స్టేట్ రౌడీ టైటిల్ ఓ ఫీలర్ మాత్రమే!?

State Rowdy title is not fixed for Ram Charan!
Saturday, September 29, 2018 - 15:45

ప్రజాభిప్రాయ సేకరణలో మెగా కాంపౌండ్ తర్వాతే ఎవరైనా. తమకు కావాల్సిన మేటర్ పై సైలెంట్ గా ఫీలర్ వదిలి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడంలో మెగా హీరోలు దిట్టలు. తాజాగా కూడా అలాంటిదే ఓ ఫీలర్ వదిలారు. రామ్ చరణ్ సినిమాకు "స్టేట్ రౌడీ" అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అనే అనుమానం కలిగింది మేకర్స్ కు. 

అనుమానం కలిగిన మరుక్షణం చిన్న ఫీలర్ వదిలారు. బోయపాటి-చరణ్ సినిమాకు స్టేట్ రౌడీ అనే టైటిల్ పెడుతున్నారట అనే గాసిప్ సోషల్ మీడియాలో 2 రోజుల పాటు వైరల్ అయిపోయింది. ఎంతో ఆసక్తి, మరెంతో చర్చ... ఓవరాల్ గా టైటిల్ పై మెగా కాంపౌండ్ కు ఓ క్లారిటీ వచ్చేసింది. తమకు కావాల్సిన సమాచారం వచ్చిన వెంటనే స్టేట్ రౌడీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చింది యూనిట్. కేవలం అది పుకారు మాత్రమే అని కొట్టిపారేసింది. 

అయితే "స్టేట్ రౌడీ" అనే టైటిల్ పై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటనే విషయంపై మాత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ మరో చిన్న హింట్ కూడా ఇచ్చారు. మొత్తమ్మీద చరణ్ కొత్త సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

నిజానికి ఇలా పాత టైటిల్స్ పెట్టడం బోయపాటికి ఇష్టం ఉండదు. పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకుంటాడు కానీ, ఆల్రెడీ వాడేసిన టైటిల్ పెట్టాలని మాత్రం అనుకోడు.