పోర్న్ స్టార్ గా ఫేమస్ డైరక్టర్ కూతురు

Steven Spielberg's daughter Mikaela turns porn star
Thursday, February 20, 2020 - 22:15

స్టీవెన్ స్పీల్ బర్గ్.. ప్రపంచం మెచ్చిన దర్శకుడు. ఎంతోమందిని తన సినిమాలతో హీరోలుగా మార్చిన ఘనుడు. ఎన్నో ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న క్రియేటర్. ఇలాంటి దర్శకుడి కూతురు ఇప్పుడు పోర్న్ స్టార్ అవుతోంది. అవును.. స్పీల్ బర్గ్ కూతురు మైకాలా పోర్న్ స్టార్ గా మారబోతోంది.

ఆమె ఇప్పటికే న్యూడ్ ఫొటో షూట్ సెషన్ పూర్తిచేసింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె తన తొలి పోర్న్ సినిమాలో నటించబోతోంది. ఈ మేరకు తనకు తండ్రి స్పీల్ బర్గ్ కి చెప్పినట్లు చెబుతోంది మైకాలా. ఐతే, ఇది హాలీవుడ్ కి కూడా షాక్ గురిచేసింది. 23 ఏళ్ల ఈ యువతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనుంది. అతని వయసు 47 ఏళ్ళు. ఐతే, కాబోయే వాడు ఇబ్బంది పడకుండా... కెమెరా ముందు ఇతరులతో సెక్స్ చేస్తున్న సీన్ లు చెయ్యడట... కానీ న్యూడ్ గా అంతా చూపిస్తుందట. స్పీల్బర్గ్ ఈ అమ్మాయిని చిన్నప్పుడే దత్తత తీసుకున్నాడు. స్పీల్ బర్గ్ కి ఏడుగురు పిల్లలు. 

భారతీయులు పోర్న్ ను తప్పుగా చూస్తారు. కానీ అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఇది కూడా ఓ ప్రొఫెషన్. రెగ్యులర్ హాలీవుడ్ స్టార్స్ కు పోటీగా పోర్న్ స్టార్స్ అభిమానగణాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది పాపులర్ పోర్న్ స్టార్స్ కు లక్షల్లో అభిమానులున్నారు. వాళ్ల సినిమాలకు జనం క్యూ కడతారు. సదరు పోర్న్ స్టార్స్ కూడా అలానే కొనసాగేందుకు ఇష్టపడతారు కూడా.

అంతెందుకు.. సన్నీ లియోన్ కూడా తనను తాను పోర్న్ స్టార్ గా చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడదు. ఆ రంగంలో ఆమె ఎన్నో ఎత్తులు కూడా చూసింది. కాలం కలిసొచ్చి బాలీవుడ్ లో ఆమె పాపులరైంది కానీ లేకపోతే.. ఈపాటికి పోర్న్ ఫీల్డ్ లో ఆమె సరికొత్త ఎత్తులకు వెళ్లి ఉండేది.