రవితేజని ఇంతగా ఏకిన వారు లేరు

The story behind tiff between Ravi Teja and Ajay Bhupati
Thursday, September 5, 2019 - 16:30

రవితేజకి ఇన్నాళ్లూ ఉన్న పేరు మాస్‌ మహారాజా. కానీ అతని మహారాజ్‌ కాదు చీప్‌ స్టార్‌ అంటూ ఒక దర్శకుడు ట్యాగ్‌ తగిలించాడు. ఒక పెద్ద హీరోని డైరక్ట్‌గా ఇంత మాట అన్నవాళ్లూ చాలా అరుదు. అఫ్‌కోర్స్‌....అజయ్‌ భూపతి తన ట్వీట్‌లో ఎక్కడా రవితేజ పేరుని డైరక్ట్‌గా మెన్సన్‌ చేయలేదు కానీ తాను ట్వీటింది రవితేజ గురించే అని అతనే ఇన్‌డైరక్ట్‌గా ఒప్పుకుంటున్నాడు. రెండు రోజులుగా మీడియాలోనూ ఇదే మేటర్‌ నలుగుతోంది. 

రవితేజ... కథ కన్నా మనీకి ఇంపార్టెన్స్‌ ఇస్తాడనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ఎవ్రీవన్‌ నోస్‌ కదా. అజయ్‌ భూపతి ఇంతగా తిట్టడానికి కూడా రవితేజ డబ్బు పిచ్చే. మొదట రవితేజ.. అజయ్‌ భూపతి చెప్పిన కథ విని ఎక్సయిట్‌ అయ్యాడు. దాంతో అతను జెమిని కిరణ్‌ అనే నిర్మాతని తీసుకొచ్చాడు. పారితోషికం గురించి మొదట మాట్లాడినపుడు తర్వాత చూసుకుందాం లే ..మీరు ప్రీ ప్రొడక్షన్‌ మొదలుపెట్టుకొండి అని రవితేజ నిర్మాతకి, దర్శకుడికి చెప్పాడట. ఐతే... ఎపుడైతే జెమిని కిరణ్‌ తాను అడిగినంత పారితోషికం ఇవ్వలేడన్న మేటర్‌ అర్థమైందో..అపుడు రవితేజ పక్క చూపులు మొదలుపెట్టాడట. ఇతర నిర్మాతలు, దర్శకులతో చర్చలు షురూ చేశాడట.

దాంతో అజయ్‌ భూపతికి ఎక్కడో కాలింది. అందుకే రవితేజని చీప్‌స్టార్‌ అని అంత ఘాట్టిగా విమర్శించాడు.