భారతీయుడు 2 కథ ఇదే

Is this story of Bharateeyudu 2
Thursday, August 29, 2019 - 22:45

కమల్‌హాసన్‌ మొత్తానికి మెట్టు దిగి రాకతప్పలేదు. పారితోషికం తగ్గించుకున్నాడు. దానివల్లే సినిమా షూటింగ్‌ మొదలైంది. నెలల తరబడి వాయిదా పడ్డభారతీయుడు 2 మూవీ షూటింగ్ కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. 

 కమల్ హాసన్, ప్రియా భవానీ శంకర్‌లపై వచ్చే సన్నివేశాలు దర్శకుడు శంకర్ తీస్తున్నారిపుడు. ఈ సినిమాలో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. ఐతే ఆమె సీన్లు ఇపుడే తీయరు. కమల్‌హాసన్‌తో పాటు దర్శకుడు శంకర్‌ కూడా తమ పారితోషికాల్లో 50 శాతం తగ్గంచుకున్నారు. వారు తగ్గిన తర్వాతే నిర్మాణ సంస్థ లైకా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కి అవకాశం ఇచ్చింది. 

కథ ఏంటంటే...
భారతీయుడు 2 సినిమా... సిద్దార్థ్‌తో మొదలవుతుందట. సిద్దార్థ్‌ ఈ సినిమాలో వీడియో బ్లాగర్‌గా నటిస్తున్నాడు. సమాజంలో జరిగే అన్యాయాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు సిద్దార్థ్‌. ఇంత ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేవారు లేరా అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు. ఆ వీడియో చూసిన... సేనాపతి (కమల్‌హాసన్‌) తిరిగి వస్తాడు. భారతీయుడు సినిమాలోనే తాతగా కనిపించిన కమల్‌హాసన్‌ ఈ సినిమాలో ఇంకా పండు ముసలిగా కనిపిస్తాడు. వయసు మళ్లినా.. అతని ఎనర్జీ మారదు.. అన్యాయాలను ఎదుర్కొనే శక్తి తగ్గదు. ఎందుకంటే అతనికి సనాతన మర్మవిద్య తెలుసు. ఎప్పటికీ ఎనర్జీగా ఉండే విద్య అది. 

రకుల్‌.. సిద్దార్థ్‌ గాల్‌ఫ్రెండ్‌గా నటిస్తోంది.