శుభ‌లేఖ‌+లు లోనూ బోల్డ్ స్ట‌ప్పు!

Subhalekhalu plus goes for bold promotion
Tuesday, July 17, 2018 - 18:30

బోల్డ్ స్ట‌ప్ ఉంటే సినిమాకి వ‌చ్చేస్తారు జ‌నం. ఇది ఎప్ప‌టిక‌పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. బోల్డ్ ఉండ‌గానే స‌రిపోదు.
టేకింగ్ కూడా బాగుండాలి. నేరేష‌న్ గ్రిప్పింగ్‌గా ఉండాలి. అందుకే "ఆర్ ఎక్స్ 100" ఆడుతోంది. ఈ సినిమా స్ఫూర్తితో కొత్త‌గా రానున్న చిన్న సినిమాలు కూడా డేరింగ్ ప్ర‌మోష‌న్‌ని షురూ చేశాయి.

శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ ప్రధాన పాత్రల్లో "శుభలేఖ+లు" పేరుతో ఒక సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ని కూడా అదే ప‌ద్ద‌తిలో మొద‌లుపెట్టారు. పెళ్లి అనేది ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టారు ఈ మేక‌ర్స్‌. ఇంట్రస్టింగ్ టీజర్‌లను విడుద‌ల చేస్తున్నారు.

పెళ్లి గురించి ఓ మోడ్రన్‌ అమ్మాయి త‌న‌ అభిప్రాయాన్ని చెప్పే వెరైటీ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు.