సుద్దాల ఇప్పుడిలా ఉన్నారు!

Suddala Ashok Teja's video message
Thursday, July 9, 2020 - 17:30

ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకి ఇటీవలే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హాస్పిటల్ వైద్యులు. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కరోనా సీజన్ లో ఆయన పరిస్థితి ఎలా వుంది?

సర్జరీ చేయించుకున్న సుద్దాల ఇటీవల ఎక్కడా బయటకు రాలేదు. దీంతో మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి.  ఈసారి స్వయంగా అశోక్ తేజ ఓ వీడియో రిలీజ్ చేయరు.  కేవలం కరోనా ప్రభావం వల్ల తను బయటకు రావడం లేదని ఆయన స్పష్టంచేశారు.

తన చిన్న కొడుకు అర్జున్ తేజ తనకు కాలేయం దానం చేశాడని, అలా సర్జరీ చేయించుకున్న తను ప్రస్తుతం ఇంట్లోనే సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టంచేశారు. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకు పాటలు కూడా రాస్తున్నట్లు తెలిపారు.