సుధామూర్తికి ఫేవరేట్... దేవరకొండ

Sudhamurthy's favourite Telugua actor is Vijay Deverakonda
Sunday, February 9, 2020 - 21:00

ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి గురించి పరిచయం అక్కర్లేదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్యగా కన్నా గొప్ప సామజిక సేవకురాలిగా మరింతగా పాపులర్.  ఆమె చేసే  దానాలు, దాతృత్వ  కార్యక్రమాల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమెకి తెలుగుసినిమాలు అంటే ఇష్టం. అయితే, ఆమె అభిమాన నటుడు మెగాస్టారో, సూపర్ స్టారో అనుకుంటే పొరపాటు. ఆమెకి తెలుగులో అభిమాన నటుడు మన నేటి రైజింగ్ స్టార్... విజయ్ దేవరకొండ. 

"విజయ్ నటన బాగా నచ్చుతుంది. గీత గోవిందంలో చాలా నచ్చాడు. బాగా టాలెంట్ ఉన్న కుర్రాడు. ఇలాగే కంటిన్యూ అవ్వాలి," అని ఆమె విజయ్ గురించి చెప్పారు. 

విజయ్ దేవరకొండ.. మెట్రో నగరాల ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. తమిళ, మలయాళ భాషా ప్రేక్షకులకి చేరువయ్యాడు ఏంతో కొంత. ఇక ఇప్పుడు హిట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు.