దాన్ని అలా వ‌ద‌లించుకున్న సుధీర్‌

Sudheer Babu sells satellite rights for paltry amount
Tuesday, November 27, 2018 - 15:30

నిర్మాతగా మొదటి సినిమా ఎంతో ప్రేమగా తెరకెక్కించాడు. చాలా గ్రాండ్ గా పబ్లిసిటీ చేశాడు. అలా ఓ మోస్తరు అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది "నన్ను దోచుకుందువటే" సినిమా. అన్నీతానై సుధీర్ బాబు నటించి, నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ''బాగుంది'' అనే రిమార్క్ మాత్రం సంపాదించుకుంది. తొలి సినిమాతో టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించుకున్న సుధీర్.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.

ఆ సినిమా థియేటర్లలో పెద్దగా నడవకపోయినా.. శాటిలైట్ రూపంలో కలిసొస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. అతడికి ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది

భారీ మొత్తం కోసం మొన్నటివరకు సుదీర్ఘంగా వెయిట్ చేసిన సుధీర్ బాబు, నిర్మాతగా తను తీసిన తొలి సినిమాను నామమాత్రానికి వదిలించుకున్నాడు. కేవలం కోటి రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ వదులుకున్నాడు ఈ హీరో కమ్ నిర్మాత. విడుదలకు ముందు 3 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో కోటికే కథ ముగించాడు.

అలా నిర్మాతగా తీసిన తొలి సినిమాను పూర్తిస్థాయిలో వదిలించుకోగలిగాడు సుధీర్ బాబు. ఈ అనుభవాలతో నిర్మాతగా తన రెండో సినిమాకు ఈ హీరో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.