రష్మీని ఎందుకు వదిలేశావ్ సుధీర్

Sudheer responds about Rashmi
Tuesday, November 12, 2019 - 18:15

బుల్లితెర హాటెస్ట్ గాసిప్స్ లో సుడిగాలి సుధీర్, జబర్దస్త్ రష్మీ ఎఫైర్ కూడా ఒకటి. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందో లేదో తెలీదు కానీ, గాసిప్స్ మాత్రం బోలెడన్ని ఉన్నాయి. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారని కొందరు వాదిస్తే, కేవలం జబర్దస్త్  వరకే వాళ్ల బంధం పరిమితం అంటూ మరికొందరు వాదిస్తుంటారు. దీనిపై వీళ్లిద్దరూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు మాత్రం వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వీళ్లిద్దరి జంట హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేశాడు సుడిగాలి సుధీర్. రాజశేఖర్ పులిచర్ల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ధన్య బాలకృష్ణ నటించింది. సమస్య అంతా ఇక్కడే వచ్చింది. సుడిగాలి సుధీర్ కు ఆల్రెడీ రష్మీ క్లోజ్. పైగా ఇద్దరి మధ్య చాలా గాసిప్స్ ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటే సినిమాకు మంచి మైలేజీ వచ్చేది కదా. ఇదే ప్రశ్నను సంధించింది మీడియా. దీనికి సుధీర్ దగ్గర కూడా సమాధానం ఉంది.

ఈ సినిమా అనుకున్నదే తడవుగా ముందుగా రష్మీనే సంప్రదించారట మేకర్స్. సుధీర్ సూచన మేరకే ఆ పని చేశారు. కానీ కాల్షీట్లు, రెమ్యూనరేషన్, కథ లాంటి విషయాల్లో సెట్ అవ్వక రష్మీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. సుధీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ ఈ విషయాల్లో కూడా రష్మీ చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది. అలా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో రష్మీ తో నటించే చాన్స్ మిస్ అయిందంటూ బాధగా చెప్పుకొచ్చాడు సుధీర్. ఆ తర్వాతే ధన్యను తీసుకున్నామని అన్నాడు.