హీరో కూతురు హీరోయిన్ కానుందా?

Suhana Khan models for mom Gauri Khan
Saturday, May 16, 2020 - 00:45

ఈ బడా హీరో కూతురికి హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయి. ఈ ఫోటోషూట్ చూస్తే ఈ భామ టాప్ హీరోయిన్ అవుతుందేమో అనిపిస్తోంది. షారుక్ ఖాన్ కూతురు సుహానా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలని షేర్ చేసింది. తల్లి గౌరీ ఖాన్ ఈ ఫోటోలని తీసింది. ఇంట్లో తీసిన ఫొటోల్లోనే ఇంత హాట్ గా ఉంటే ... మరి వెండితెరపై ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆమె పోస్ట్ కి కామెంట్స్ పడుతున్నాయి. 

సుహానాకి 19 ఏళ్ళు. ప్రస్తుతం న్యూయార్క్ లోనే చదువుకుంటోంది. అక్కడ ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలోనే ఉంది. కరోనా వ్యాధి కారణంగా ఇండియాకి వచ్చిందిప్పుడు. అయితే, ఆమె హీరోయిన్ గా మారాలంటే ...షారుక్ పర్మిషన్ కావాలి. షారుక్ రెండేళ్లుగా సినిమాల్లో నటించడం లేదు. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది కానీ రెండు సినిమాలు మొదలు పెడుతాడు.