ఇన్ స్టాలో కాలం వెల్లదీస్తోన్న సుజీత్

Sujeeth spending time in Instagram
Friday, February 14, 2020 - 17:15

ఇన్ స్టాగ్రామ్ అంటే ఇప్పుడు సెలెబ్రిటీలకి ఫేవరెట్ సోషల్ మీడియా వేదిక. ట్విట్టర్ లో కన్నా ఇన్ స్టాలో ఇష్టంగా స్పెండ్ చేస్తున్నారు టైం.

హీరోయిన్లు అంతా తమ ఫోటోషూట్ లు అప్లోడ్ చేసి కుర్రకారుకి ఆనందాన్ని పంచుతున్నారు. హీరోలు, వాళ్ళ భార్యలు ఫామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొందరు దర్శకులు తమ గత సినిమాల మేకింగ్ ఫోటోలు షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ముఖ్యంగా వెంటనే సినిమా చేసేందుకు హీరోల డేట్స్ ఖాళీ లేక ఖాళీగా ఉన్న దర్శకులు ఇలాంటి షేరింగ్ తో ఇన్ స్టాగ్రామ్ లో కాలం వెళ్లదీస్తున్నారు. 

సాహో సినిమాతో తాను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్న కుర్ర డైరక్టర్ సుజీత్ కి వాస్తవం బోధపడింది. నెక్స్ట్ సినిమా సెట్ చేసుకుందాం అంటే శర్వానంద్ తప్ప మరో హీరో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక శర్వకేమో తాజాగా విడుదలైన జాను తర్వాత ఎలాంటి సినిమాలు చెయ్యాలో తెలియని సీను. అందుకే... శర్వా ఇంకా ఒకే చెప్పలేదు సుజీత్ కి. 

సో ఈ గ్యాప్ లో సుజీత్ తన పాత సినిమాల, షార్ట్ ఫిలింల మేకింగ్ ఫొటోస్ అప్డేట్ చేస్తున్నాడు.