నాకు ఫుల్ క్లారిటీ ఉంది

Sujith says he has full clarity
Friday, August 9, 2019 - 00:15

దర్శకుడు సుజీత్ సాహో మేకింగ్ టైంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనేది టాక్. అందుకే సినిమా ఇంత లేట్ అయింది అంటారు. కానీ ఇదంతా సిల్లీ అని అంటున్నాడు సుజీత్. నాకు క్లారిటీ లేకపోతే... "రన్ రాజా రన్" సినిమా విడుదల కాగానే ప్రభాస్ పిలిచి అవకాశం ఇస్తాడా అని ప్రశ్నిస్తున్నాడు. 

"ప్రభాస్ అన్న అప్పుడు ఇప్పుడు నాకు సపోర్ట్ గా ఉన్నాడు. మీడియా ఎన్ని వార్తలు అల్లినా సినిమా మేకింగ్ టైంలో ప్రభాస్ అన్న నాకు ఫుల్ మద్దతు ఇచ్చాడు. లేట్ అయిందని మీరు అన్నారు కానీ సినిమా అస్సలు డిలే అవ్వలేదు. మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫినిష్ చేసాము. కాకపొతే చివర్లో ఐమాక్స్ ప్రింటింగ్ విషయంలో కొంత ఇబ్బంది వచ్చింది. దాని వల్లే సినిమా 15 డేస్ పోస్టుపోన్ అయింది. ఆధార్ దెన్ దట్, అన్ని పక్కాగా సాగాయి. 

ప్రభాస్ తనకి అవకాశం ఇచ్చింది తన కథ విని అంటున్నాడు సుజీత్.