చ‌ర‌ణ్ కోస‌మే రాశా, తీశా: సుకుమార్‌

Sukumar: All credit goes to Ram Charan
Monday, April 2, 2018 - 16:00

"రంగ‌స్థ‌లం" సినిమా గురించే ఇపుడు అంద‌రూ మాట్లాడుతున్నారు. చ‌ర‌ణ్ త‌న స‌త్తా ఏంటో ప్రూవ్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్‌కి న‌టుడిగా గొప్ప పేరు రాలేదు. ఈ సినిమాతో అది ద‌క్కింది. ఇక ద‌ర్శ‌కుడిగా సుకుమార్ సినిమాలు యావ‌రేజ్ స్థాయి దాట‌లేక‌పోతున్నాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి. వాటికిపుడు బ్రేక్ ప‌డింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌, మంచి పేరు రెండూ వ‌చ్చాయి. ఆ ఆనందంలో ఉన్నాడు సుకుమార్‌.

ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌లో సినిమాకి సంబంధించిన వారింద‌రికీ థ్యాంక్స్ చెప్పాడు. ఐతే అసలు క్రెడిట్ మాత్రం చ‌ర‌ణ్‌కే ద‌క్కుతుందన్నాడు.

"చ‌ర‌ణ్‌కు, నాకు కామ‌న్ ఫ్రెండ్ రంగ. అత‌ని ద్వారా నాన్న‌కు ప్రేమ‌తో స‌మ‌యంలో చ‌ర‌ణ్‌ని క‌లిశాను. త‌ను నా మైండ్‌లోఉండిపోయాడ‌మో.. కాబ‌ట్టి ఈ సినిమాకు రంగ‌స్థ‌లం అనే టైటిల్‌ను పెట్టుకున్నాను. ఈ సంద‌ర్భంగా మామిత్ర‌డు రంగ‌కు థాంక్స్‌. `నాన్న‌కు ప్రేమ‌తో త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబుగారు సెక్సీగా ఉన్నారు` అని చాలా మంది అన్నారు. త‌ర్వాత రంగ‌స్థ‌లం సినిమా చూసిన త‌ర్వాత కూడా అలాగే అంటున్నారు. ఆయ‌న ఏ రూపంలో ఉన్నా బంగార‌మే. ఆయ‌న‌తోనే ప్రేమ‌లోప‌డిపోయాను. ఆయ‌న‌తో ప్ర‌తి సినిమా చేయాల‌నుకుంటున్నాను. రంగ‌మ్మ‌త్తను సెట్స్‌లో ఎంత బాధ పెట్టినా.. త‌ను మాత్రం పెర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఈ పాత్ర‌ను ఎంచుకోవ‌డంలో నేను చాలా క‌న్‌ఫ్యూజ‌న్ అయ్యాను. చివ‌ర‌కు అన‌సూయ‌ను ఎంచుకున్నాను. అన‌సూయ త‌న పాత్ర‌కు ఎంతో న్యాయం చేసింది. . ఆది పినిశెట్టి ఆమేజింగ్ ఆర్టిస్ట్‌. కుమార్ బాబు క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా చేశాడు. చిట్టిబాబు కంటే కుమార్‌బాబు క్యారెక్ట‌ర్‌నే ఇష్ట‌ప‌డ్డాను."

ఇక సాంకేతిక నిపుణులను కూడా సుకుమార్ పొగిడేశాడు. " చంద్ర‌బోస్‌గారి సాహిత్యం.. ఎంత స‌క్క‌గున్నావే అనే పాట‌ను అంద‌రూ ఎంతో పొగుడుతున్నారు. ఆ పాట‌ను కేవ‌లం 20 నిమిషాల్లో ఇచ్చారు. రామ‌కృష్ణ ఆర్ట్  డైరెక్ష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.  న‌వీన్ నూలి ఎడిటింగ్‌.. గురించి చెప్పాలంటే.. త‌ను ఇండ‌స్ట్రీ ఉన్నంత కాలం ఉండిపోయే ఎడిటర్‌. త‌ను అన్నీ డిపార్ట్ మెంట్స్‌పై అవ‌గాహ‌న ఉంది. ర‌త్న‌వేలుగారు సినిమాటోగ్ర‌ఫీతో అందంగా పెయింటింగ్ వేస్తారు. ఏ క్యారెక్ట‌ర్‌ను ఎలా చూపించాల‌ని.. ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా రాసే రైట‌ర్ అని చెప్పొచ్చు. త‌ను ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ అని చెప్ప‌గ‌ల‌ను. స్పాంటేనియ‌స్‌గా వ‌ర్క్ చేసి అద్బుత‌మైన అవుట్‌పుట్ ఇచ్చే టెక్నీషియ‌న్‌."

ఆర్య నుంచి సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీప్ర‌సాద్‌తో సుకుమార్ అనుబంధం కొన‌సాగుతూనే ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌లో దేవీ స్వ‌ర‌ప‌ర్చిన రంగ‌మ్మ మంగ‌మ్మ‌, ఎంత స‌క్క‌గున్నావె పాట‌లు కీల‌క పాత్ర పోషించాయి. ఓపెనింగ్స్‌, బజ్‌కి అవి తోడ్ప‌డ్డాయి. "దేవి నా ఆత్మ‌. త‌ను లేక‌పోతే నేను లేను. నా ఆత్మ‌కు రూప‌ముంటే అది దేవినే. మా మ‌ధ్య వ్య‌క్తిగ‌త సానిహిత్యం కూడా ఉంది. . మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌లో ఖ‌ర్చు గురించి ఎక్క‌డా డిస్క‌ష‌న్ రాలేదు. సినిమా చేసే క్ర‌మంలో నేను ఎక్క‌డ త‌ప్పులు చేస్తున్నానో అర్థ‌మైంది. నిర్మాత‌లు ముగ్గురు బోళా శంక‌రులు. వారికి మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ రావ‌డానికి కార‌ణం వారి మంచి మ‌న‌సు. సినిమాపై వారికున్న ప్రేమ‌," అన్నాడు సుకుమార్‌

చ‌ర‌ణ్ ఒప్పుకోక‌పోతే ఈ క‌థ అస‌లు రాసేవాడిని కాద‌న్నాడు సుకుమార్‌. "చ‌ర‌ణ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చిట్టిబాబు క్యారెక్ట‌ర్లో నేను ఎవ‌రినీ ఊహించ‌లేదు. అలాంటి క్యారెక్ట‌ర్‌ను ఒప్పుకోవ‌డం  సాహ‌సం. త‌ను చేయ‌లేక‌పోతే.. నేను ఏమీ చేయ‌లేను. విన‌గానే కొత్త‌గా ఉంటుంద‌ని న‌మ్మి క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకుని చేశాడు. డీ గ్లామ‌రైజ్డ్‌క్యారెక్ట‌ర్‌ను ఇష్ట‌ప‌డి చేశాడు. ఈ క్రెడిట్ అంతా త‌న‌కే ద‌క్కుతుంది," అన్నాడు.