సుమ కూడా పులిహోర కలిపేసింది

Sumakka makes pulihora during lodkdown
Friday, April 3, 2020 - 10:30

పులిహోర కలపడం అంటే అందరికీ ఇప్పుడు ఒకటే అర్థం కనిపిస్తోంది. కానీ యాంకర్ సుమ మాత్రం నిజంగానే పులిహోర కలిపింది. శ్రీరామనవమి కావడం, పైగా లాక్ డౌన్ టైమ్ కూడా కావడంతో సుమ ఇలా ఇంట్లో తీరిగ్గా పులిహోర కలుపుతూ కూర్చుంది. ఆ వీడియోను ఇనస్టాలో కూడా పోస్ట్ చేసింది,

"అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పులిహోర కలుపుతున్నాను. వచ్చేస్తారా. అలాంటి పని మాత్రం చేయొద్దు. ఇంట్లోనే ఉండండి. బయటకు రాకండి. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే శ్రీరామనవమి చేస్కోండి." ఇలా ఓ చిన్నపాటి సందేశాన్ని కూడా ఇచ్చేసింది సుమ.

కరోనా వల్ల చాన్నాళ్లకు సుమకు తీరిక దొరికింది. లేదంటే పొద్దున్నుంచి రాత్రి వరకు షూటింగులే. ఈ ఛానెల్, ఆ ఛానెల్ అనే తేడాలేకుండా ప్రతి ఛానెల్ లో ఈమె కార్యక్రమాలు కనిపించాల్సిందే. అలా తీరికలేకుండా గడిపేసే సుమ జోరుకు కరోనా బ్రేకులు వేసింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో సుమ కూడా ఇంటికే పరిమితమైపోయింది. ఊహించని విధంగా కలిసొచ్చిన ఈ గ్యాప్ ను కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేస్తూ ఎంజాయ్ చేస్తోంది.