ఆ ముగ్గురు అమ్మాయిలతో వర్కౌట్ కాలేదు

Sundeep Kishan opens about love affairs with three girls
Monday, August 5, 2019 - 19:15

 లవ్ ఎఫైర్ పుకార్లు సందీప్ కిషన్ కి కొత్తేమి కాదు. ఆఫ్-స్క్రీన్ అతడు మంచి రొమాంటిక్ అనే విషయం మీడియాలో చాలామందికి తెలుసు. అయితే ఇతడి రొమాంటిక్ యాంగిల్ గురించి వాళ్లు వీళ్లు చెప్పడమే తప్ప, సదరు హీరో ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. 

ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. "నిను వీడని నీడను నేనే" సక్సెస్ ఇచ్చిన ఆనందంలో తన లవ్ ఎఫైర్లన్నీ బయటపెట్టేశాడు సందీప్. గతంలో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఎవరి పేర్లు బయటపెట్టలేదు. 

"గత రెండేళ్లుగా నేను సింగిల్ గానే ఉన్నాను. నిజంగా చెబుతున్నాను, ముగ్గురు అమ్మాయిలతో గతంలో నేను రిలేషన్ షిప్ లో ఉండేవాడ్ని. బ్రహ్మాండమైన అమ్మాయిలు. వాళ్ల దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ ఎవరితో వర్కవుట్ కాలేదు. కానీ నేను హ్యాపీ."

ముగ్గురిలో ఎవరితో వర్కవుట్ కాలేదు కాబట్టి, ఇప్పుడు నాలుగో అమ్మాయి కోసం వెయిటింగ్ అంటున్నాడు సందీప్ కిషన్.  ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ప్రేమించే పెళ్లాడతానంటున్నాడు. వీటితో పాటు తన లేటెస్ట్ సినిమా హీరోయిన్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. తెర వరకే ఆమెతో రొమాన్స్ చేశానని, తెరవెనక మాత్రం ఆమెతో ఎలాంటి రిలేషన్ షిప్ లేదంటున్నాడు ఈ రియల్ లైఫ్ లవర్ బాయ్.