బిగింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వులే!

Sundeep Kishan says Tenali Ramakrishna is a laugh riot
Sunday, September 15, 2019 - 15:45

'నిను వీడని నీడను నేనే' వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తెనాలి రామకృష్ణ బి,ఏ,బి,ఎల్". హన్సిక మోత్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది.  జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కొత్తనిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"నాగేశ్వర్ రెడ్డి మీద వున్న నమ్మకంతో అతని స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మించినందుకు వారికి నా థాంక్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఫస్ట్ టైం సిన్సియర్ గా నా పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిదే. ఎమోషన్స్ తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే వుంటారు. కొత్త ఎంటర్టైనర్ మూవీని చూస్తారు ప్రేక్షకులు. అన్నీ తానై నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమా చేసారు. ఈ సినిమా నేనేనా చేసింది అనిపించింది. హన్సికతో వర్క్ చేయడం అమేజింగ్ గా అనిపించింది. సెట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది తను. తెనాలి రామకృష్ణ బి,ఏ,బియల్, సినిమా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది," అన్నారు హీరో సుందీప్ కిషన్. 

హీరోయిన్ హన్సిక మోత్వానీ: "నాగేశ్వరరెడ్డితో ఇది రెండవ సినిమా. ఇట్స్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ. ఫ్యామిలీస్ తో పాటు యూత్ అందరు ఎంజాయ్ చేస్తారు."