కేఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ?
Submitted by tc editor on Wed, 2019-07-10 18:29
Sunil getting ready for K A Paul bipoic?
Wednesday, July 10, 2019 - 18:30
ప్రముఖ ఇవాంజెలిస్ట్ కె.ఏ పాల్ బయోపిక్ తీయబోతున్నారు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కేఏ పాల్‌గా సునీల్ నటించబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయమై సునీల్ ఇంతవరకు నోరు విప్పలేదు. ఐతే, ఈ సినిమా కోసమే సునీల్ తాజాగా అమెరికా వెళ్లాడట. పాల్‌కి తగ్గ మేకప్‌ని క్రియేట్ చేసుకునేందుకు అమెరికా వెళ్లినట్లు టాక్. మరోవైపు, ఆ సినిమా లో ట్రంప్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే పోలికలు వుండే ఆర్టిస్ట్ ని గుర్తించిందట టీమ్.
ఈ సినిమా లో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ , హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ పోలికలుండే ఆర్టిస్ట్‌లు కూడ నటిస్తున్నట్టు టాక్.
ఇంతకీ ఇదంతా నిజమేనా లేక పబ్లిసిటీ కోసం చేస్తున్న క్యాంపెయినా?
- Log in to post comments