సన్నీ లియోన్ ఇప్పట్లో రాదు

Sunny Leone may not return India this year
Wednesday, May 20, 2020 - 14:00

ఇండియాలో కన్నా అమెరికాలోనే కరోనా తీవ్రత తక్కువ. కానీ సన్నీ లియోన్ భయపడిపోయి అమెరికా వెళ్లి దాక్కొంది. అమెరికా పౌరసత్వం ఉన్న సన్నీ లియోన్ ఆ దేశం ప్రొవైడ్ చేసిన ప్రత్యేక విమానంలో లాస్ ఏంజెల్స్ కి చెక్కేసింది. మరో ఆరు నెలల నుంచి ఏడాది పాటు అక్కడే ఉంటుందట. ఇండియాకి ఇప్పట్లో రాదు. కరోనా భయం పూర్తిగా పోయేంతవరకు అంతే. 

సన్నీ లియోన్ కి ఇప్పుడు ఇండియాలో అంత అర్జెంట్ పనులు కూడా ఏమి లేవు. అవకాశాలు సన్నగిల్లాయి. ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ వీడియోస్, ఫొటోస్, ఆల్బమ్స్ తో బిజిగా ఉంటోంది. 

మరోవైపు, మహారాష్ట్రలో ఈ ఏడాది మొత్తంగా షూటింగులు జరగడం డౌటే అని అంటున్నారు. బాలీవుడ్ లో మళ్ళీ షూటింగ్ కళకళ వచ్చే ఏడాదే.