కృష్ణ డ్యూయల్ రోల్ సినిమాలు

Superstar Krishna's dual role movies
Sunday, May 31, 2020 - 12:00

తన 5 దశాబ్దాల కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు సూపర్ స్టార్ కృష్ణ. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఎన్నో రికార్డులు సృష్టించారు. కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా.. ప్రయోగాత్మక చిత్రాలకు నాంది పలికారు. ఈ క్రమంలో కృష్ణ నటించిన డ్యూయల్ రోల్ పాత్రలు కూడా ఎక్కువే.

తన కెరీర్ లో 32 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలో ఏ హీరో ఇప్పటివరకు ఇన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేయలేదు. అలా ఇండియాలోనే అత్యథికంగా డ్యూయల్ రోల్స్ చేసిన హీరోగా కూడా రికార్డు సృష్టించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ 32 సినిమాల్లో 7 సినిమాల్లో కృష్ణ ఏకంగా ట్రిపుల్ యాక్షన్ కూడా చేశారు.

ఇందులోనే మరో రికార్డు కూడా దాగుంది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో 3 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఏకైక హీరో కూడా కృష్ణే. అవే అగ్నిపర్వతం, అందరికంటే మొనగాడు, మహామనిషి సినిమాలు. ఈ 3 సినిమాలూ 1985లో రిలీజ్ అయ్యాయి.

ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతాయి, తుడిచిపెట్టుకుపోతాయి. కానీ కృష్ణ స్థాపించిన ఈ డ్యూయల్ రోల్ రికార్డును కొట్టడం మాత్రం మరో హీరో వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా ఏడాదికి 2-3 సినిమాలు తీయడమే గొప్ప. అందులో 32 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ నటించడం అంటే అసాధ్యమనే చెప్పాలి.

ఇక కృష్ణ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన ఆ సినిమాల లిస్ట్ చూద్దాం.

ద్విపాత్రాభినయం
1. టక్కరి దొంగ చక్కని చుక్క - గోపీ, శ్యామ్  పాత్రలు
2. మా ఇంటి వెలుగు - కిషోర్, గోపి
3. దీర్ఘసుమంగళి - రామచంద్రరావు, ప్రకాష్
4. అభిమానవతి - రాము, శ్రీనివాస్
5. రామరాజ్యంలో రక్తపాశం - వేణు, గోపి
6. చుట్టాలున్నారు జాగ్రత్త - రమేష్, గంగులు
7. బండోడు గుండమ్మ - ఆంజనేయులు, రాఘవ
8. అంతం కాదిది ఆరంభం - కన్వర్ లాల్, విజయ్
9. చట్టానికి వేయి కళ్లు - విజయ్, ఆనంద్
10. శక్తి - రాము, కృష్ణ
11. యుద్ధం - కృష్ణారావు, కిషన్
12. దొంగల బాబోయ్ దొంగలు - రాము, కృష్ణ
13. అగ్నిపర్వతం - జమదగ్ని, చంద్రం
14. అందరికంటే మొనగాడు - రవి, రాజా
15. మహామనిషి - గోపి, రాజా
16. కృష్ణ గారడీ - నాగరాజు, కృష్ణ
17. సింహాసనం - విక్రమసింహ, ఆదిత్య వర్థనుడు
18. సర్దార్ కృష్ణమనాయుడు - కృష్ణమనాయుడు, విజయ్
19. శంఖారావం - విక్రమ్, విజయ్
20. అగ్నికెరటాలు - సూర్యం, క్రాంతి కుమార్
21. అత్త మెచ్చిన అల్లుడు - కిష్టయ్య, భవానీప్రసాద్
22. ఎస్.. నేనంతే నేనే - శ్రీహర్ష, చంద్రం
23. రెండు కుటుంబాల కథ - కిషోర్, రమేష్ చంద్ర
24. మానవుడు దానవుడు -  దుర్గ, గుణ
25. పండంటి సంసారం - కృష్ణమనాయుడు, రుద్రమనాయుడు

ట్రిపుల్ రోల్ మూవీస్
26. కుమార రాజా - విజయరాఘవ భూపతి, కుమార్, రాజా
27. పగబట్టిన సింహం - హరికృష్ణ, మోహనకృష్ణ, ముద్దుకృష్ణ
28. డాక్టర్ సినీ యాక్టర్ - మధు, రాజు, ప్రభాకర్
29. సిరిపురం మొనగాడు - లయన్, శ్రీధర్, ఆనంద్
30. బంగారు కాపురం - గోపి, కృష్ణ, రాజారవీంద్ర
31. రక్త సంబంధం - చక్రవర్తి, కృష్ణ, విజయ్
32. బొబ్బిలి దొర - హరిశ్చంద్ర ప్రసాద్, శరత్ చంద్ర ప్రసాద్, కృష్ణ ప్రసాద్