సురేఖ వాణి ఇలా కూడా!

Surekha Vaani posts quarantine pics
Thursday, March 26, 2020 - 13:15

సురేఖ వాణి అంటే గ్లామర్ పోస్టులతో గిలిగింతలు పెట్టే క్యారక్టర్ నటి అనే పేరుంది. ఎందుకంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు ఆలా ఉంటాయి. నిత్యం గ్లామర్ ఫోటోలు అప్లోడ్ చేసే సురేఖ వాణి ఇప్పుడు ఇంటిపట్టున ఉంటూ ఇంటి పనులు చేస్తున్న ఫోటో పెట్టి సర్ప్రైజ్ చేసింది. ఇది క్వారంటైన్ టైం అంటూ ఆమె శుభ్రం చేస్తున్న వీడియోని పెట్టింది. 

అలా.. సురేఖ వాణిలో మరో కోణాన్ని చూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ పుణ్యమా అని సెలెబ్రిటీలు కూడా సామాన్యుల్లా మారారు. సామాన్యులు చేసే పనులు వారు కూడా చేస్తూ ....వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మనం రెగ్యులర్ గా చేసే పనులు వాళ్ళు లాక్ డౌన్ వల్ల చేస్తున్నారు కాబట్టి.

సురేఖ వణికి పావు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 25 లక్షల మంది.