సురేఖవాణికి ప‌తి వియోగం

Surekha Vani husband passes away
Monday, May 6, 2019 - 19:00

త‌ల్లి పాత్ర‌లు, వ‌దిన పాత్ర‌ల‌తో బాగా పాపుల‌ర అయిన న‌టి సురేఖ‌వాణి భ‌ర్త అనారోగ్యంతో క‌న్నుమూశారు. సురేఖ‌వాణి భ‌ర్త సుర్య‌తేజ కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ చ‌నిపోయారు. 

సురేఖ‌వాణి, సూర్య‌తేజ‌కి ఒక కూతురు ఉంది. భ‌ర్త అనారోగ్యం కార‌ణంగానే సురేఖ‌వాణి కొంత‌కాలంగా సినిమాలు త‌గ్గించారు.