పంచెకట్టిన హాట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్

Surekha vani makes hulchal
Friday, May 8, 2020 - 22:30

సిల్వర్ స్క్రీన్ పై ఆమె సాఫ్ట్ గా కనిపిస్తుంది. కానీ ఆమెలో సిసలైన హాట్ నెస్ చూడాలంటో సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవ్వాల్సిందే. తన పేరు సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించిన ఈ నటి.. సోషల్ మీడియాలో చేసే హాట్ హంగామా మాత్రం అంతా ఇంతా కాదు. తాజాగా మరోసారి సురేఖ వాణి తన టాలెంట్ చూపించింది. పంచె కట్టుతో స్టయిలిష్ గా అదరగొట్టింది.

తన కూతురితో కలిసి పంచె కట్టులో సురేఖ వాణి చేసిన డాన్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.  నిజానికి సురేఖకు ఇలాంటి ఫీట్స్ కొత్తకాదు. ఎప్పటికప్పుడు ఆమె తన వాల్స్ పై కొత్తగా దర్శనమిస్తుంటుంది. అప్పట్లో ఓసారి చిన్న నిక్కర్ వేసుకొని డాన్స్ చేసి ఆమె చేసిన హంగామా కుర్రాళ్లకు ఇంకా గుర్తే.

సురేఖవాణి ప్రస్తుతం సింగిల్. గతేడాది ఆమె భర్త మరణించాడు. అప్పట్నుంచి కూతురే లోకంగా బతుకుతోంది ఈమె. ఏ సందడైనా, సెలబ్రేషన్ అయినా, వెకేషన్ అయినా కూతురు సుప్రీతతోనే. అందులో భాగంగానే కూతురుతో కలిసి ఇలా టిక్ టాక్ లో హంగామా చేసింది ఈ క్యారెక్టర్ నటి.