కళ్యాణ్ రామ్ కి సైరా డైరెక్టర్ సారీ

Surender Reddy offers sorry to Kalyan Ram
Sunday, October 13, 2019 - 16:30

డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. సైరా సినిమాని హేండిల్ చేసిన విధానం అతనికి బాగా పేరు తెచ్చింది. ఇంతకుముందు 'అతనోక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధ్రువ' వంటి హిట్స్ ఇవ్వడం ఒక ఎత్తు, 'సైరా' లాంటి పీరియడ్ సినిమా తీయడం మరో ఎత్తు. అందుకే సురేందర్ రెడ్డికి బాగా పేరు వచ్చింది. 

ఐతే ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉండడడానికి అసలు రీసన్ మాత్రం... కళ్యాణ్ రామ్. 'అతనొక్కడే' సినిమా కథ నచ్చి కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డిని డైరక్టర్ గా పరిచయం చేశాడు. కానీ కళ్యాణ్ రామ్ కి ఆ తర్వాత మంచి విజయం ఇవ్వలేదు. కళ్యాణ్ రామ్ బ్యానర్ లో 'కిక్ 2' సినిమా నిర్మిస్తే దాన్నీ కంగాళీ చేసి, తనకి ఫస్ట్ మూవీ ఇచ్చిన నిర్మాతకి నష్టాలని మిగిల్చాడు సురేందర్ రెడ్డి. అందుకే ఇప్పుడు సారీ ఫీల్ అవుతున్నాడు.

"నా జీవితంలో ఎవరికైనా థాంక్స్ చెప్పాలన్నా, సారీ చెప్పాలన్నా ..కళ్యాణ్ రామ్ కే," అని తాజాగా ఈనాడు కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు సూరి. మరి ఇంకో మంచి హిట్ ఇచ్చి ఆ రుణాన్ని తీర్చుకుంటాడా అన్నది చూడాలి.