మాకు ఫ్లాప్ డైరెక్టర్లే కావాలి!

Suresh Babu wants flop directors
Tuesday, February 4, 2020 - 14:00

నిర్మాత సురేష్ బాబు ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్లని సెలెక్ట్ చేసుకుంటారనేది టాక్. . ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలకి  "నారప్ప" ఛాన్స్ ఇచ్చింది అలాగే. బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ ఇచ్చిన అడ్డాల తో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాతలు జంకుతున్న టైంలో సురేష్ బాబు పిలిచి మరి అతనికి 'అసురన్' సినిమా రీమేక్ ఇచ్చారు. దానికో రీజన్ ఉందట.

రామానాయుడు కూడా ఒకప్పుడు అలాగే చేసేవారట. ప్లాప్ ఇచ్చిన దర్శకులకి ఛాన్సులు ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన చరిత్ర రామానాయుడుదంట. హిట్ ఇచ్చిన డైరక్టర్లు చెప్పిన మాట వినరు. నిర్మాతలు అక్కడ డమ్మీ. అదే ఫ్లాప్ దర్శకుడు ఐతే.... హిట్ కొట్టాలనే కసిగా ఉంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడనేది రామానాయుడు లాజిక్. అదే ఫార్ములాని ఆయన కొడుకు సురేష్ బాబు ఫాలో అవుతున్నారట.

వేరే బ్యానర్ లో వెంకటేష్ చేసే సినిమాలు హిట్ దర్శకులతో ఉంటాయి. సొంత బ్యానర్ లో మాత్రం ... పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్స్, కొత్త వారికి అవకాశాలు ఇస్తారు అంట. అన్ని సార్లు కాదు కానీ ఎక్కువ శాతం ఇలా ఉంటుంది సురేష్ బాబు ప్లాన్.