ముదిరి పాకాన పడిన వివాదం

Suriya produced Jyothika's film controversy turns ugly
Tuesday, April 28, 2020 - 17:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో నిర్మాతలంతా తమ సినిమాల్ని ఓటీటీకి ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొంతైనా ఆర్థికంగా కోలుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఇలా ఓటీటీకి ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీ రెండు ముక్కలైంది కూడా. ఇదిలా ఉండగా.. ఇప్పుడీ వ్యవహారంలో సూర్య ఏకంగా వివాదం సృష్టించాడు.

లాక్ డౌన్ కారణంగా సూర్య తీసుకున్న ఓ నిర్ణయం తమిళ డిస్ట్రిబ్యూటర్లకు ఆగ్రహం తెప్పించింది. తన నిర్మాణంలో భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీకి ఇవ్వడానికి రెడీ అయ్యాడు సూర్య. దీంతో కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సూర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా చేస్తే, అతడు నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాతో పాటు సూర్య నటించిన ఏ సినిమాను థియేటర్లలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో వివాదం మరింత పెద్దదైంది.

లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర డైరక్ట్ చేసిన ఈ సినిమాకు కూడా సూర్యానే నిర్మాత. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఆల్రెడీ ట్రయిలర్ తో పాటు కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇలా ఊహించని విధంగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బెదిరింపు రావడంతో సూర్య ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

అయితే సూర్య వెనక్కి తగ్గినా.. కోలీవుడ్ పెద్దలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఓ సీనియర్ హీరోను ఇలా బెదిరించడం సభ్యత కాదంటూ కోలీవుడ్ అంతా సూర్యకు మద్దతుగా నిలిచింది. ఓటీటీకి ఇవ్వకుండా థియేట్రికల్ రిలీజ్ కు సినిమా ఇస్తే.. ఏకథాటిగా 3 వారాల పాటు థియేటర్లలో ఆడిస్తామనే గ్యారెంటీ ఇస్తారా అంటూ డిస్ట్రిబ్యూటర్లను ప్రశ్నిస్తున్నారు కోలీవుడ్ పెద్దలు. దీంతో వివాదం మరింత పెద్దదైంది.

​టాలీవుడ్-కోలీవుడ్ కు ఈ విషయంలో చాలా తేడా ఉంది. అక్కడ నిర్మాతల మండలి చాలా స్ట్రాంగ్. డిస్ట్రిబ్యూటర్ల వింగ్ అంతకంటే స్ట్రాంగ్. ఇలాంటి రెండు బలమైన వ్యవస్థలు నువ్వానేనా అన్నట్టు ఇప్పుడు వాదులాడుకుంటున్నాయి. అటు సూర్య నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.