నగ్నంగా నటించినా నా భర్తకి ఓకే!

Surveen Chawl's controversial statement
Friday, May 22, 2020 - 15:15

నగ్నంగా నటించినా మా ఆయన తప్పు పట్టడు!!

బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలో బాలీవుడ్ హీరోయిన్ల తర్వాతే ఎవరైనా. తమకు ఇష్టమైన శృంగార భంగిమల గురించి కూడా ఓపెన్ గా మాట్లాడిన హీరోయిన్లు ఉన్నారక్కట. ఇప్పుడీ లిస్ట్ లోకి సుర్వీన్ చావ్లా అనే మరో ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. మరో బోల్డ్ స్టేట్ మెంట్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

ఆల్రెడీ ఈమెకు పెళ్లయింది. ఢిల్లీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయినా కెరీర్ ను మాత్రం కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే మరింత హాట్ గా రెచ్చిపోతోంది. ఇదే విషయంపై మీడియా ఆమెను ప్రశ్నించింది. దీనికి సుర్వీన్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా నటించినా తన భర్త ఏమీ అనడంటోంది ఈ బ్యూటీ. ఈ విషయంలో తనకు, తన భర్తకు మంచి అండర్ స్టాండింగ్ ఉందని చెబుతోంది. నిజానికి గతంలో వీళ్లిద్దరూ విడిపోతారంటూ ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని స్పష్టంచేసిన సుర్వీన్.. పెళ్లి తర్వాత మరింతగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది.

అన్నట్టు ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ కనెక్షన్ కూడా ఉంది. శర్వానంద్ హీరోగా నటించిన రాజు మహారాజు సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. అది అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో సుర్వీన్ దుకాణం సర్దేసింది.