సూర్య పరిస్థితి ఇలా అయిందే

Surya's Bandobast gets poor openings
Saturday, September 21, 2019 - 20:15

గజిని సూర్యకి ఒకపుడు తెలుగులో యమా క్రేజ్‌ ఉండేది. సూర్య సినిమా విడుదలవుతోందంటే మిగతా తెలుగు హీరోలు తమ సినిమాలను వాయిదావేసుకునేవారు. ఈ ముచ్చటంతా కొన్ని ఏళ్ల క్రితం. ఐతే గజిని, యముడు, సింగం సినిమాలు మినహా మిగతా సినిమలేవీ సంచలనాలు నమోదు చేయలేకపోయాయి. గత మూడేళ్లుగా పరిస్థితి మరింత క్షీణించింది. ఈ ఏడాది ఇంతకుముందు వచ్చిన ఎన్‌.జీ.కే సినిమానే దారుణమైన పరాజయం చూసింది అనుకుంటే అంతకన్నా దారుణమైన ఓపెనింగ్స్‌ని తెచ్చుకొంది బందోబస్త్‌ మూవీ. 

ట్రయిలర్‌ ఆకట్టుకునేలా లేకపోతే.. ఓపెనింగ్స్‌ రావు. అది ఇప్పటి ట్రెండ్‌. బందోబస్త్‌ ట్రయిలర్‌ ఆకట్టుకోలేకపోయింది. పైగా హీరోయిన్‌ సాయేషా అంటే అట్టర్‌ఫ్లాప్‌ హీరోయిన్‌. మోహన్‌లాల్‌ ఉన్నా... కూడా సినిమాకి కనీస స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు. 

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ, ఆ టీమ్‌ పబ్లిసిటీ బాగా చేసింది. ఈ సినిమా ట్రయిలర్‌, కంటెంట్‌ ఎలా ఉన్నా... పబ్లిసిటీ టీమ్‌ వర్క్‌ చేసింది. అలాగే సినిమాకి భారీ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. ఐతే ఓపెనింగ్స్‌ మాత్రం తుస్సుమన్నాయి. ఇది సూర్య తప్పిదమే. సూర్య ఎన్నుకుంటున్నస్టోరీస్‌ అలా ఉన్నాయి మరి.